ఆంధ్రప్రదేశ్‌

ఉత్సాహంగా.. ఉద్వేగంగా జల్లికట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 15: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన చంద్రగిరి నియోజకవర్గంలో కనుమ పండుగను పురస్కరించుకుని ఆదివారం ఉత్సాహంగా.. ఉద్వేగంగా జల్లికట్టు జరిగింది. మండలోని పుల్లయ్యగారిపల్లె, రంగంపేట, మల్లయ్యగారి పల్లె, నారావారిపల్లె, అరిగిరివారిపల్లె, కొటాలా, కందులవారిపల్లె, నర్సింగాపురం, భీమవరం ప్రాంతాల్లో జరిగిన జల్లికట్టులో సుమారు 1700 పశువులు పాల్గొన్నాయి. కాగా జల్లికట్టు నిర్వహించరాదని పోలీసులు పుల్లయ్యగారిపల్లె, రంగంపేటలో గో యజమానులను హెచ్చరిస్తూ గోడలపై నోటీసులు అంటించినా ప్రజలు వాటిని బేఖాతర్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నారావారిపల్లె నుంచి తిరుగు ప్రయాణం కాగానే నిర్వాహకులు జల్లికట్టు నిర్వహించారు. ఇందుకు ప్రధాన కారణాలు ముఖ్యమంత్రికి భారీ భద్రత కల్పించడం, సిఎం గ్రామంలో ఉండగానే జల్లికట్టు నిర్వహిస్తే విమర్శలు వస్తాయన్న ఆలోచనతోనే నిర్వాహకులు సిఎం అటు వెళ్లగానే తాము అనుకున్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా పుల్లయ్యగారిపల్లె, రంగంపేట, మల్లయ్యపల్లె, అంగరివారిపల్లెలో పెద్దఎత్తున జల్లికట్టు నిర్వహించారు. ఒక్క రంగంపేటలోనే 900లకు పైగా పశువులతో జల్లికట్టు జరిగింది. పశువులను వదిలిన వెంటనే యువకులు వాటిని పట్టుకోవడానికి ప్రాణాలకు తెగించి ఎదురేగారు. ఇక గోవులు వారికి దొరక్కుండా బుసలు కొడుతూ బుల్లెట్ వేగంతో ముందుకు పరుగులు తీశాయి.
పశువుల పరుగులతో చెలరేగిన దుమ్ము ఆప్రాంతాలను మంచులా కప్పేసింది. కాగా ఈ జల్లికట్టు పందేలను తిలకించడానికి వేల సంఖ్యలో పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు తరలివచ్చారు. ఈక్రీడలను తిలకించడానికి పలువురు యువకులు, చెట్లు, మిద్దెలు పైకెక్కి సాహసాలు చేశారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే పలు ప్రాంతాల్లో జరిగిన జల్లికట్టు సందర్భంగా కొంతమంది యువకులు స్వల్పగాయాలకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన గుడుపల్లెలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి గాయాలు కాగా రైలు ఢీకొని రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఎద్దులను నిలువరించే క్రమంలో రెండు ఎద్దులు పారిపోగా అదే సమయంలో చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న రైలు ఢీకొని ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి.

చిత్రం..చంద్రగిరి మండలం రంగంపేటలో జరిగిన జల్లికట్టు వేడుక