ఆంధ్రప్రదేశ్‌

కుటీర పరిశ్రమలు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, జనవరి 15: ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లు రద్దు చేయటంతో చిన్నవ్యాపారాలు, కుటీర పరిశ్రమలు కుదేలయ్యాయని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు వల్ల 60నుండి 70శాతం వరకు వ్యవసాయం కుంటుపడిందని చెప్పారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ రంగం, కుటీర పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పార్లమెంట్‌లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరారు. దేశం దారిద్య్ర రేఖకు దిగువన వున్న వారిని 40శాతం కంటే ఇంకా తగ్గించే అంశాన్ని పరిశీలించాలని నీతి ఆయోగ్‌కు కేంద్ర ప్రభుత్వం సూచించిందని, ఇది తగదని మనోహర్ వ్యతిరేకించారు. సంక్షేమ పథకాల అమలులో కోత విధించేందుకు కేంద్రం పన్నుతున్న కుట్రను పార్టీలకు అతీతంగా అందరూ వ్యతిరేకించాలని కోరారు.