ఆంధ్రప్రదేశ్‌

‘కాకినాడకు ఘనకీర్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 15: ఏటా నిర్వహిస్తున్న సాగర సంబరాలు (బీచ్ ఫెస్టివల్)తో కాకినాడ నగరానికి పేరు ప్రఖ్యాతులు లభించాయని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ తీర ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించిన సాగర సంబరాలకు పెద్ద ఎత్తున పర్యాటకులు హాజరు కావడం ఆనందంగా ఉందని చెప్పారు. కాకినాడ బీచ్ ఫెస్టివల్-2017 వాకలపూడి ఎన్టీఆర్ సాగర తీరంలో ఆదివారం రాత్రితో ముగిసింది. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఏడాది నాలుగు రోజుల పాటు పండుగ వాతావరణంలో బీచ్ ఫెస్టివల్‌ను జరుపుకుంటున్నట్టు చినరాజప్ప పేర్కొన్నారు. ఫెస్టివల్‌కు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారన్నారు. కాకినాడ బీచ్ ఫెస్టివల్ స్ఫూర్తితో వచ్చే ఫిబ్రవరిలో కోనసీమ, మార్చిలో గిరిజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కోరంగి అభయారణ్యం, హోప్ ఐలాండ్, గోదావరి తీర ప్రాంతాలను వచ్చే ఏడాదిలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చినరాజప్ప తెలియజేశారు. ఎన్టీఆర్ సాగర తీరంలో నాలుగు రోజుల పాటు ప్రముఖ కళాకారులచే ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. అలాగే సంక్రాంతి రోజు ‘నేను లోకల్’ సినిమా ఆడియో సీడీలను ఆవిష్కరించారు. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం పాటలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ దంపతులు, కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్ అలీం పాషా తదితరులు విడుదల చేశారు. కార్యక్రమంలో చిత్ర నాయక, నాయకిలు నాని, కీర్తి సురేష్, నిర్మాత దిల్ రాజు, దేవిశ్రీప్రసాద్, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు.