ఆంధ్రప్రదేశ్‌

‘గోశాల సందర్శనతోనే పరిపూర్ణత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 15: తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకునే భక్తులు గోశాలను సందర్శించేందుకు కూడా టిటిడి తగిన ఏర్పాట్లు చేయాలని, అలా చేయగలిగితే భక్తుల యాత్రకు మరింత పరిపూర్ణత చేకూరుతుందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. స్థానిక టిటిడి ఎస్వీ డెయిరీఫాంలో జరిగిన గోపూజోత్సవంలో ఆయన మాట్లాడుతూ గో సంరక్షణకు టిటిడి విశేషంగా కృషి చేస్తోందని, ఇటీవల పుంగనూరు నుంచి గోవధశాలకు తరలివెళుతున్న గోవులను రక్షించి గోశాలకు చేర్చడం అభినందనీయమని, వీటిలో ఒక లేగదూడ కూడా ఉందని చెప్పారు. ఈ దూడ ఆకలి తీర్చడానికి టిటిడి పాలు తెప్పించి, చిన్న బిడ్డలకు పట్టించినట్లు పట్టించిందన్నారు. విశ్వంలో 24 లక్షల జీవరాశుల్లో సుగంధ ద్రవ్యాలు, మానవాళికి ఉపయోగపడే ఔషధ గుణాలున్న జంతువు గోవు ఒక్కటేనన్నారు. అంతకుముందు టిటిడి చైర్మన్ చదలవాడ, ఇఒ సాంబశివరావు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ఇస్కా మాజీ చైర్మన్ నారాయణరావు, గోశాలలోని వేణుగోపాల స్వామి పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గౌరీ, తులసి పూజల్లో పాల్గొన్నారు.