ఆంధ్రప్రదేశ్‌

కళకళలాడిన నారావారిపల్లె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, జనవరి 15: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తన స్వగ్రామంలో మూడు రోజులపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లెకు చేరడంతో ఆ పల్లె కళకళలాడింది. ముఖ్యంగా నారావారిపల్లె వాసులు ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, నారా లోకేష్ తనయుడు దేవాన్ష్‌ను చూసి మురిసిపోయారు. సర్వసాధారణంగా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబ సభ్యులను చూడటానికి పల్లెవాసులు ప్రతి ఏడాది ఆసక్తి చూపేవారు. అయితే ఈమారు సంక్రాంతి పండుగకు సిఎం మనవడు దేవాన్ష్ రావడంతో ఆ చిన్నారిని చూడటానికి స్థానికులు అమితాసక్తి చూపారు. ఓవైపు ముఖ్యమంత్రికి పటిష్ఠమైన భద్రతావలయం ఉన్నా వారిని సైతం చేధించుకుని చిన్నారిని చూడటానికి బారులు తీరారు. ముఖ్యంగా శనివారం చంద్రబాబు నాయుడు తన తల్లిదండ్రులైన ఖర్జురపునాయుడు, అమ్మణమ్మల సమాధుల వద్ద కుటుంబ సభ్యులతో కలసి నివాళులు అర్పించే సమయంలో తన మనవడికి అవ్వ, తాత అంటూ చెప్పారు. ఈ సందర్భంగా అందరు నమస్కరిస్తూ ఉంటే ఆ చిన్నారి కూడా నమస్కరించాడు. ఈ దృశ్యం చూసిన పల్లెవాసులు తమలో తాము ఉప్పొంగారు. అంతకుముందు ఎన్‌టిఆర్ విగ్రహానికి నివాళులు అర్పించే సమయంలో కూడా దేవాన్ష్ స్పందనపై స్థానికులు ఎనలేని ఆసక్తిని చూపించడం కనిపించింది. ఇక ఆదివారం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు నాగాలమ్మ గుడి వద్దకు వెళ్లి పూజలు చేస్తున్న సమయంలో బ్రాహ్మణి తన కుమారుడు దేవాన్ష్‌కు చూపిస్తు నమస్కరించుకోవాలని చెప్పిన వెంటనే ఆ బాలుడు నమస్కరించడం చూసి పల్లెవాసులు బాలుడికి ఎనలేని భక్త్భివాలు వచ్చాయని చెప్పుకోవడం వినిపించింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజులపాటు నారావారిపల్లెలో గడిపిన సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులను ఏర్పాటుచేసి గ్రామంలోకి వచ్చే ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యమంత్రిని గతంలో జిల్లా నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున వచ్చి కలిసేవారు. అయితే ఈసారి ఆ అవకాశం లేకపోవడం, కేవలం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులకే పరిమితం చేయడంతో మిగిలినవారు నిరాశకు గురయ్యారు. తమ బాధలు చెప్పుకోకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ శాపనార్ధాలు పెట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పల్లె నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో అక్కడ వేచి ఉన్న వారి వద్ద నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
సిఎంకు మోహన్‌బాబు శుభాకాంక్షలు
ఇదిలావుంటే, ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు తన కుమారులతో కలసి ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈనేపథ్యంలో మోహన్‌బాబు టిడిపిలో తిరిగి అడుగు పెడతారన్న చర్చ జరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని ముందుగానే ఊహించిన మోహన్‌బాబు అటు తరువాత విలేఖరులతో మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిని కలసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడానికే వచ్చానని, అంతకుమించి మరో కారణం లేదని వివరణ ఇచ్చి ఊహాగానాలకు తెరదించారు. కాగా మోహన్‌బాబుతోపాటు ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా ఉన్నారు.

చిత్రాలు..నారావారిపల్లెలో పూజలు చేస్తున్న చంద్రబాబు దంపతులు* నాగాలమ్మకు నమస్కరించాలని దేవాన్ష్‌కు చెబుతున్న తల్లి బ్రాహ్మణి