ఆంధ్రప్రదేశ్‌

అంగన్‌వాడీ సరకుల నాణ్యతపై సీఎం ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 16: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సరకుల నాణ్యతపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాతీశారు. జ్యూరిచ్ నుంచి రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, కందికి గిట్టుబాటు ధరపై సోమవారం ఆయన అధికారులతో టెలిఫోన్‌లో సమీక్షించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నాణ్యత కలిగిన నిత్యావసర వస్తువులను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి 15 రోజులకు ఒకసారి తనిఖీలు చేయాలని సూచించారు. కంది కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు నష్టం కలగని రీతిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వివరించారు.