ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమి ద్వారా ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 16: జన్మభూమి కార్యక్రమం ఒక పండుగలా సాగిందని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే అవకాశం దీనిద్వారా లభించిందని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. సోమవారం సిఎం క్యాంప్ కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని అడ్డుకుంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సంపదను దోచుకోవాలని చూస్తున్నారని, రాష్ట్రం నాశనం కావాలని కోరుతున్నారని, ఇందుకు అనేక ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు పెద్దపీట వేస్తున్నారని, దాన్ని మరచి జగన్ అడ్డగోలుగా దళిత వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించటం తగదన్నారు. ప్రజలు తిరస్కరించిన నాయకులు ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు సిద్ధమని మంత్రి రావెల సవాల్ చేశారు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా 12వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, దాన్ని ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడవచ్చన్నారు. కాంగ్రెస్ హయాంలో 45వేల కోట్ల రూపాయల సబ్‌ప్లాన్ నిధులకు లెక్కాపత్రం లేదని విమర్శించారు.