ఆంధ్రప్రదేశ్‌

కాపుల ఆధిపత్యాన్ని భరించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 16: కాపులను గత 64 సంవత్సరాలుగా మోస్తూనే ఉన్నాం. ఇక ఏ మాత్రం భరించలేం. బలిజలకు రాజకీయంగా న్యాయం జరగడానికి ప్రాణాలైనా అర్పిస్తాం. నెలాఖరులోగా సిఎంను కలసి మాకు న్యాయం చేయాలని కోరుతామని టిటిడి పాలక మండలి మాజీ సభ్యుడు ఓవి రమణ ఉద్వేగంగా అన్నారు. తిరుపతిలో తన స్వగృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. బలిజల్లో వెనుకబాటుతనంలో మహిళలు పడుతున్న అవస్థలు మాటల్లో చెప్పలేనంటూ ఆయన ఉద్వేగానికి గురై కంటతడిపెట్టారు. కాపులను తాము ఇప్పటి వరకు వేరుగా చూడలేదన్నారు. అయితే బలిజలకు తీరని అన్యాయం జరుగుతున్నా వారు నోరు విప్పకపోవడంతో తాము పెదవి విప్పాల్సి వచ్చిందని తెలిపారు. కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సింహభాగం వారే లబ్ధి పొందుతున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా లబ్ధి పొందిన వారు కాపులేనని, బలిజలు కనుచూపుమేరలో కూడా లేరని చెప్పారు. అందుకే నేడు రాయలసీమలో ఉద్యమం అనివార్యమైందన్నారు. ఏ విధంగా మున్నూరు కాపులు, తూర్పులకు రిజర్వేషన్లు ఇచ్చారో అలాగే బలిజలకు కూడా ఇవ్వాల్సి ఉన్నా వాటి గురించి ఆలోచించే నాథుడే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బలిజలకు సంబంధించి మంజునాథ కమిషన్‌ను కలసి వినతిపత్రం ఇచ్చానని, ఆయన కూడా బలిజలకు జరుగుతున్న అన్యాయాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారని అన్నారు.