ఆంధ్రప్రదేశ్‌

తూ.గోలో ఆరడుగుల మునక్కాడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, జనవరి 16: తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి కూరగాయల మార్కెట్‌కు సోమవారం సాయంత్రం ఆరు అడుగుల మూడు అంగుళాల పొడవుగల భారీ ము నగకాడ వచ్చింది. కడియం మండలం వేమగిరికి చెందిన దొంగ భాస్కరరావు అనే రైతు తన పొలంలోని మునగ చెట్టుకు కాసిన ఈ కాడను మార్కెట్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ తన పొలంలో గల మునగ చెట్టుకు సుమారు వెయ్యి మునగ కాడలు ఉన్నాయని వాటిలో సుమారు ఐదు వందలకాడలు వరకూ నాలుగు అడుగుల పొడవు ఉన్నాయని తెలిపారు. దీనిపై రాజమహేంద్రవరం హార్టీకల్చర్ హెచ్‌ఓ మల్లికార్జునరావును వివరణ కోరగా జన్యపరమైన లోపాలు ఏర్పడడం వల్లకాని, వృక్షానికి అధిక పోషకాలు అందినప్పుడు ఇటువంటి లక్షణాలు గల కాయలు కాస్తుంటాయని తెలిపారు.

చిత్రం..6.3 అడుగుల పొడవుగల మునగకాడ