ఆంధ్రప్రదేశ్‌

నిన్న రాజవౌళి.. నేడు క్రిష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 16: ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాల్లో ఇప్పుడు ఆర్కిటెక్ట్‌ల కంటే సినిమా దర్శకులకే ప్రాధాన్యం పెరిగిపోయింది. గతంలో తెలుగు సినీ చరిత్రలో రికార్డులు సృష్టించిన బాహుబలి దర్శకుడు ఎస్ ఎస్ రాజవౌళి సలహాలు కోరిన బాబు, తాజాగా సంచలనం సృష్టించిన గౌతమీపుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్ నుంచి కూడా ఇన్‌పుట్స్ తీసుకోవాలని తీసుకోవాలని సిఆర్‌డిఏ అధికారులకు సూచించారు. చారిత్రక సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో నిర్మించిన రాజధాని నగరం సెట్‌ను చూసి ముగ్ధుడయిన బాబు ఆ సినిమా దర్శకుడు జాగర్లమూడి క్రిష్, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి లను రాజధాని నగరం ఎలా ఉండాలన్న దానిపై రూపకల్పన చేయాలని కోరారు. గతంలో ఇదేవిధంగా బాహుబలి తీసిన దర్శకుడు రాజవౌళికి స్వయంగా బాబు ఫోన్ చేసి, రాజధాని నగరం, వీధు ల నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయని, అమరావతి నగర నిర్మాణంలోనూ అలాంటి అందమైన కట్టడా లు, రాచరిక శోభ ఉట్టిపట్టే తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఆవిష్కృతమయ్యే డిజైన్లు ఇవ్వాలని బా బు కోరారు. అందుకు అంగీకరించిన రాజవౌళి, తా ను బాహుబలి -2తో బిజీగా ఉన్నానని, అది అయిపోయిన తర్వాత అమరావతి డిజైన్లకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు రాజవౌళి వద్దకు వెళ్లి వచ్చారు. అత్యంత కీలకమైన అమరావతి నగర ని ర్మాణానికి ఇప్పటికే విదేశీ ఆర్కిటెక్ట్‌లతో డిజైన్లను ఆహ్వానించారు. భారత్‌లో ప్రసిద్ధి చెందిన ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ కూడా ఫోస్టర్‌తో కలిపి ఈ రెండు భవన సముదాయాల నిర్మాణ డిజైన్ల రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు. అయితే వీరికి తెలుగు చారిత్రక నిర్మాణ కౌశలంపై అవగాహన కల్పించేందుకు వీరి నుంచి సమాచారాన్ని, నమూనాలను సేకరించాలని సిఎం, సిఆర్‌డిఏ అధికారులను ఆదేశించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి తెలంగాణ ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న యాదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ను రూపొందించారు. సి ఎం ఆదేశాల ప్రకారం తాము క్రిష్, సాయిల నుంచి ఇన్‌పుట్‌లను స్వీకరిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.