ఆంధ్రప్రదేశ్‌

దత్తత స్వీకారానికి పన్ను రాయితీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునే తల్లిదండ్రులకు రెండు సంవత్సరాల పాటు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ అథారిటి (కారా) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఒకవైపు దత్తత ఇవ్వడానికి కారా వద్ద కేవలం 1,800 మంది పిల్లలు మాత్రమే అందుబాటులో ఉండటం, పి ల్లల అక్రమ రవాణా విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో కారా ఈ సూచన చేసింది. తమ సంస్థ ద్వారా మాత్రం జరుగుతున్న దత్తతలు చాలా తక్కువ ఉంటున్నాయని కారా సిఇఒ లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ చెప్పారు. అందువల్ల దత్తత తీసుకునేవారికి రెండేళ్ల పాటు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల తల్లిదండ్రులు అక్రమ మార్గాలలో దత్తత స్వీకారాలను మానుకుంటారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి చేసే బడ్జెట్ ప్రసంగం కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎదురు చూస్తోంది.