ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 16: ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం- డబ్ల్యుఈఎఫ్) 47వ వార్షిక సదస్సు ఈ నెల 17న ప్రారంభం కానుంది. 20 వరకు జరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ సమస్యల వలయంలో కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో వాటి పరిష్కారానికి ఈ సదస్సు కీలకం కానుంది. ‘స్పందించే బాధ్యతాయుత నాయకత్వం’ అనే ఇతివృత్తంతో ఈ దఫా సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక- 2017 సదస్సు ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేయనుంది. వినూత్న, విశ్వసనీయమైన ఒక కార్యాచరణ కోసం ఈ దఫా దావోస్ సదస్సు ప్రపంచానికి మార్గదర్శనం చేయబోతోంది. ఈ ఏడాది వివిధ విషయాలను ఒకసారి అవలోకిస్తే.. విధాన నిర్ణేతలకు, రూపకర్తలకు పరీక్ష ఎదురుకాబోతోందని ఈ వేదిక హెచ్చరించనుంది. సమాజానికి ఆందోళన కలిగిస్తున్న సంక్లిష్టతల గురించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గురించి ఈ సదస్సు కీలక చర్చలు జరిపే అవకాశముంది. ఓవైపు వివిధ రకాల వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. ప్రాంతీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా విశ్వాసాలు సన్నగిల్లుతున్నాయి. ప్రజాజీవనంలో ఎదురవుతున్న సంక్లిష్టతలు, ఆనిశ్చితి తొలగాలంటే పరస్పరం ఆధారపడే విధానం మరింత ఉత్సాహంగా, సమ్మిళితంగా, సహకారయుతంగా సాగాలి. దీన్ని అత్యవసర ఎజెండాగా ఈ వేదిక భావిస్తోంది. సామర్థ్యాలను మరింతగా మెరుగుపర్చుకోడానికి వున్న అనుకూలతలు, అవకాశాలను సదస్సు గుర్తించనుంది. ఈ సదస్సులో పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖ సంస్థలకు చెందిన అధినేతలు, సీఈవోలు పాల్గొంటారు. ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రపంచ ఆర్థిక వేదిక మేనేజ్‌మెంట్ బోర్డు తరపున ఫిలిప్ రోజియర్ (బోర్డు మెంబర్) గత నవంబర్‌లోనే ఒక లేఖ రాశారు. ఈ వేదిక సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఆహ్వానం అందుకోవడం చంద్రబాబుకు వరుసగా ఇది మూడోసారి. ముఖ్యమంత్రి వెంట ఉన్న బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ఇంధన వనరులు, ఐ అండ్ ఐ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో జాస్తి కృష్ణకిషోర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖ్యరాజ్, తదితరులు ఉన్నారు. 17న చంద్రబాబు దావోస్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటల నుండి (అక్కడి సమయం) జెట్రో చైర్మన్ హిరోయుకి ఇషిగేతో తొలిగా సమావేశవౌతారు. ప్రపంచ ఆర్థిక వేదికపై చంద్రబాబు ముఖ్యవక్తగా, ఉపన్యాసకునిగా కొన్ని కీలక అంశాలపై ప్రసంగిస్తారు. ‘ప్రిపేరింగ్ ఫర్ ద సిటీ సెంచరీ’ అనే అంశంపై ఆయన ముఖ్య ప్రసంగం చేస్తారు. తరువాత ఇండియా అండ్ సౌత్ ఏషియా రీజనల్ స్ట్రాటజీ గ్రూపు బోర్డ్ రూమ్ చర్చలో మనదేశం తరపున ప్రతినిధిగా పాల్గొంటారు. స్మార్ట్ నగరాలపై మాట్లాడతారు. నవీన నగరాల ఏర్పాటు, ప్రణాళికలు, పర్యావరణ హితంగా, మోస్ట్ లివబుల్ సిటీస్‌గా తీర్చిదిద్దుకోవడం, సిటీ గవర్నింగ్, సిటిజన్ సర్వీసెస్ వంటి అంశాపై చర్చలో పాల్గొంటారు. ఇది చాలా కీలక సమావేశం. ఇందులో వివిధ దేశాధినేతలు, ప్రధానులు పాల్గొంటారు. సాయంత్రం టైమ్ ఇండియా అవార్డుల ప్రదానోత్సవంలో బాబు పాల్గొంటారు. 18న ఉదయం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ - సీఐఐ బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో ‘ఇండియా అండ్ మర్జింగ్ మార్కెట్స్ ఇన్ ద న్యూ ఫేజ్ ఆప్ గ్లోబలైజేషన్’ అనే అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడతారు. మధ్యాహ్నం రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. తరువాత ‘న్యూ విజన్ ఫర్ అగ్రికల్చర్, బిల్డింగ్ అండ్ స్ట్రెంగైనింగ్ మల్టీహోల్డర్ పార్టనర్‌షిప్’ అనే అంశంపై జరిగే సమావేశంలో మాట్లాడతారు. అదేరోజు సింగపూర్ ఈడీబీ చైర్మన్ బేస్వాన్ గిస్‌తో సమావేశవౌతారు. గ్లోబల్ ఫైనాన్సింగ్, హెల్త్‌కేర్ ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. 19న వరల్డ్ ఎకనామిక్ లీడర్లతో సమావేశం వుంటుంది. అందులో ‘రిఫామ్స్ ఫర్ ఇంక్లూజీవ్ అండ్ సస్టెయినబుల్ గ్రోత్’ అనే అంశంపై జరిగే చర్చల్లో పాల్గొంటారు. 19న టెక్నాలజీ పయనీర్స్‌తో జరిగే ముఖ్యమైన సమావేశంలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తారు. 20న ‘కంట్రీ లెడ్ యాక్షన్ టు అఛీవ్ ద సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్’ అనే అంశంపై జరిగే సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రంలో సాంకేతికతను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో బ్రాండ్ ఏపి ప్రచారానికి, పెట్టుబడులు రాబట్టడానికి దావోస్ సదస్సును ఓ మంచి అవకాశంగా భావిస్తోంది. స్టాన్‌ఫోర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, కాలిఫోర్నియా యూనివర్శిటీ (బర్కిలీ క్యాంపస్) వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతోనూ ముఖ్యమంత్రి చర్చలు జరుపుతారు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీతో చర్చించి అమరావతిలో ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ అండ్ రీసెర్చ్’ ఏర్పాటుపై ఒక అవగాహన ఒప్పందం చేసుకునే అవకాశాలున్నాయి. గ్లోబల్ ఫండ్స్ ఫైనాన్సింగ్, ఐటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫాక్చరింగ్, స్మార్ట్ సిటీస్, సోలార్ వంటి రంగాలకు ఈసారి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయా రంగాలకు చెందిన ప్రపంచ పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశాలు జరుపుతారు. మెట్రోరైలు ప్రాజెక్టు వంటి వాటికి కూడా ప్రాధాన్యమిస్తారు.