ఆంధ్రప్రదేశ్‌

రెండు రాష్ట్రాల్లో రోహిత్ వర్ధంతి సభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: దళిత రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని జనవరి 17 నాటికి ఏడాది పూర్తయినా నిందితులపై ఎలాంటి కేసు పెట్టలేదని , దళిత హక్కుల దినంగా రోహిత్ వర్ధంతిని నిర్వహిస్తున్నట్టు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పేర్కొంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రోహిత్ వేముల వర్ధంతిని నిర్వహిస్తున్నట్టు రోహిత్ అభిమానులు, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ విద్యార్ధి యువజన సమాఖ్యలు ప్రకటించాయి. రోహత్ ఆత్మహత్యకు బిజెపి బాధ్యత వహించాలని, జనవరి 17ను దళిత హక్కుల దినంగా ప్రకటించాలని, విద్యాలయాల్లో మత ప్రమేయాన్ని నిషేధించాలని సమాఖ్య నేత నవనీతం సాంబశివరావు పేర్కొన్నారు.
విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించామని ఆయన చెప్పారు. రోహిత్ వేముల బలవన్మరణానికి విసి అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంఎల్‌సి రామచంద్రరావు, ఆర్‌ఎస్‌ఎస్‌విద్యార్ధి సంఘం ఎబివిపి నేతలే కారకులని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నేతలు కాడిగల్ల భాస్కర్, ప్రధానకార్యదర్శి టి స్కైలాబ్ బాబులు పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో దళిత విద్యార్ధులపై వివక్షను నివారించేందుకు రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని అన్నారు.
ఇందుకోసం ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకూ అన్ని దళిత సంఘాలు కలిసి రోహిత్ వేముల వర్ధంతిని దళిత హక్కుల దినంగా అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పిలుపునిచ్చింది.