ఆంధ్రప్రదేశ్‌

మండలి చైర్మన్‌గా సోమిరెడ్డి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 16: శాసనమండలి చైర్మన్‌గా మాజీ మంత్రి, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నిక కానున్నారు. ప్రస్తుత చైర్మన్ చక్రపాణి పదవీకాలం మార్చికి ముగియనుంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిసింది. మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సోమిరెడ్డికి మండలి చైర్మన్ ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం, వైకాపాపై ఎదురుదాడిలో కీలకపాత్ర పోషించిన సోమిరెడ్డి తెదేపాకు రక్షణకవచంలా నిలిచారు. తాజాగా రాష్ట్రంలో రెడ్డి వర్గాన్ని మెప్పించేందుకు తెదేపా నాయకత్వం తీసుకుంటున్న అనేక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇప్పటికే కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సీనియర్లను తెదేపాలో ఆకర్షించింది. రానున్న ఎన్నికల్లోగా రెడ్డివర్గాన్ని జగన్‌కు పూర్తిగా దూరం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న తెదేపా నాయకత్వం, అందులో భాగంగా మండలి చైర్మన్ పదవిని అదే వర్గానికి చెందిన సోమిరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమచారం. సోమిరెడ్డికి చైర్మన్ పదవి ఇస్తే గుంటూరు, ప్రకా శం, చిత్తూరు జిల్లాల్లో రెడ్డి వర్గం తెదేపా వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నిజానికి సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా మండలి చైర్మన్ ఆశిస్తున్నప్పటికీ, కులసమీకరణ కారణంగా ఆయనకు ఆ పదవి దక్కకపోవచ్చు. కాగా మండలిలో మొత్తం 7స్థానాలు ఖాళీ కా నున్నాయి. సాంకేతికంగా కాంగ్రెస్, వైకాపాకు తగినంత సం ఖ్యాబలం లేనందున చైర్మన్ పదవి తెదేపాకు దక్కనుంది. మొత్తం 7 స్థానాల్లో ఒకటి వైకాపా, మిగిలిన ఆరు సీట్లు తెదేపాకు దక్కనున్నాయి. ప్రస్తుత మండలి వైస్ చైర్మన్, పులివెందులకు చెందిన సతీష్‌రెడ్డి పదవీకాలం ముగియనుంది.