ఆంధ్రప్రదేశ్‌

సిఎ ఫలితాల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: చార్టర్డ్ అకౌంటెంట్స్(సీఎ)ఫైనల్ ఫలితాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దేవరాజరెడ్డి మంగళవారం ఢిల్లీలో విడుదల చేశారు. సిఎ ఫైనల్ ఫలితాలలో గ్రూప్-1 విభాగంలో 2,655 (7శాతం), గ్రూప్-2 విభాగంలో 4,245 (12శాతం)మంది ఉత్తీర్ణులైనట్టు ఆయన ప్రకటించారు. రెండు గ్రూప్‌లకు మొత్తం 36వేలమంది పరీక్షకు హాజరైతే 4,256(11.57శాతం) ఉత్తీర్ణత సాదించినట్టు వెల్లడించారు. మొదటి ర్యాంకు లక్నోకు చెందిన ఈతి అగర్వాల్‌కు, రెండో ర్యాంకు భివాండీకి చెందిన పీయూష్ రమేష్ లోహికి, అహ్మదాబాద్‌కు చెందిన జ్యోతి ముఖేష్‌కు మూడో ర్యాంకు సాధించినట్టు చెప్పారు. నిరుటి డిసెంబరులోజరిగిన సీపీటీ పరీక్షలకు 70 వేలమంది విద్యార్థులు హాజరైతే అందులో 46 శాతం ఉత్తీర్ణతతో 32,658 మంది అర్హత సాధించినట్టు చెప్పారు.