ఆంధ్రప్రదేశ్‌

పూర్తి సమాచారంతో మళ్లీ చర్చిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: ఏపీ విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లోని 89 ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు, కార్పొరేషన్‌ల విభజన, పంపకాలపై మంగళవారం కేంద్రం జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసాయి. సంస్థలకు సంబంధించిన పూర్తి సమాచారంతో రావాలని రెండు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. విభజన వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్ కుమార్ అధ్యక్షతన ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థలు, కంపెనీలు, కార్పొరేషన్‌ల విభజనపై రెండు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను కేంద్రానికి వినిపించారు. కేంద్ర హోంశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఏపీ తరపున ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కుటుంబరావు, అధికారులు ప్రేమ్‌చందర్‌రెడ్డి, బాల సుబ్రహ్మణ్యం, ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ సింఘాల్, డైరీ డెవలమెంట్ కార్పొరేషన్ ఎండీ మురళి పాల్గొన్నారు. తెలంగాణ నుంచి మత్స్య, పశు సంవర్ధక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ చందా, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్, ఆగ్రో చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు పాల్గొన్నారు. అనంతరం ఏపీ డైరీ కార్పొరేషన్ ఎండీ మురళి మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం 58:42 నిష్పత్తిలో డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రధాన కార్యలయ ఆస్తులు విభజించాలని సమావేశంలో కోరామన్నారు. తొమ్మిదవ షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై కేంద్రం ఓ పద్ధతి రూపొందిస్తుందని, అందుకోసం సమగ్ర వివరాలతో మళ్లీ రావాలని సూచించారని వెల్లడించారు. ఏపి వైస్‌చైర్మన్ కుటుంబరావు మాట్లాడుతూ తెలంగాణ అధికారులు అసంపూర్తి సమాచారం ఇవ్వడంతో పూర్తిస్థాయి సమాచారంతో రావాలని కేంద్ర హోంశాఖ కోరిందన్నారు. రెండు వారాల్లో మళ్లీ భేటీ అయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ఆగ్రో చైర్మన్ కిషన్‌రావు మాట్లాడుతూ ఆర్టీసీ, డైరీ, అగ్రో, ఏపీ ఫుడ్ కార్పొరేషన్‌లు, సంస్థల విభజనపై తమ అభిప్రాయాన్ని కేంద్రానికి వెల్లడించామన్నారు.