ఆంధ్రప్రదేశ్‌

ఫిబ్రవరిలో పిఎస్‌ఎల్‌వి-సి 37 ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 18: ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా రికార్డు ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహం చేస్తోంది. ఇంత వరకు అగ్రరాజ్యాలు చేయని ప్రయత్నాన్ని మన శాస్తవ్రేత్తలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఒకటి రెండు కాదు ఒకేసారి 103 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఫిబ్రవరి రెండో వారంలో పిఎస్‌ఎల్‌వి-సి 37 రాకెట్ ప్రయోగించేందుకు ఇస్రో సన్నద్ధమయ్యింది. దీని ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టే మన దేశానికి చెందిన ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్-2డి బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుండి రోడ్డు మార్గాన అత్యంత భారీ భద్రత నడుమ బుధవారం తెల్లవారు జామున షార్‌కు చేరింది. వారం రోజుల క్రితం షార్‌కు విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలు ముందుగానే చేరాయి. ఇప్పటికే షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక వద్ద మొదటి దశ రాకెట్ అనుసంధాన పనులు పూర్తిచేసిన శాస్తవ్రేత్తలు రాకెట్‌లోని ఎలక్ట్రిల్ తదితర వాటి పనితీరును తుది పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉపగ్రహాన్ని గురువారం ఉపగ్రహ క్లీన్ గదిలోకి చేర్చి తుది పరీక్షలు నిర్వహించిన అనంతరం రాకెట్‌తో అనుసంధానం చేస్తారు. 730కిలోల బరువు గల కార్టోశాట్-2డితో పాటు మన దేశ విద్యార్థులు రూపొందించిన ఐఎన్‌ఎస్-1ఎ, ఐఎన్‌ఎస్-1బి చిన్న ఉపగ్రహాలతో పాటు విదేశాలకు చెందిన మరో 100 ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి-సి 37 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో చరిత్ర పుటల్లో నిలవనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా దేశాలు మాత్రమే అధిక ఉపగ్రహాలు పంపిన దేశాలుగా పేరొందాయి. ఈ ప్రయోగంతో మన దేశం అధిక ఉపగ్రహాలు పంపిన దేశంగా ప్రపంచ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవనుంది. ఇస్రో వర్గాల సమాచారం మేరకు ఈ ప్రయోగం ఫిబ్రవరి 8న ప్రయోగించనున్నట్లు సమాచారం. ఇస్రో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

వేటగాడి ఉచ్చులో విలవిలలాడిన చిరుత
జూకు తరలించిన అటవీ అధికారులు
బంగారుపాళ్యం, జనవరి 18: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని పెరుమాళ్లపల్లిలో బాబురెడ్డికి చెందిన పొలంలో కంచె వద్ద అడవి పందులకోసం వేసిన ఉచ్చులో మంగళవారం రాత్రి సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత చిక్కి విలవిల లాడింది. ఉదయం అటుగా వెళ్తున్న పశువుల కాపరులు చూసి సమాచారం గ్రామస్థులకు తెలిపారు. గ్రామస్థుల నుంచి సమాచారం అందుకున్న అటవీ అధికారులకు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఉచ్చుని కత్తిరించి చిరుత అడవిలోకి వదిలేయారని యత్నించారు. అయితే అడవిలోకి వదిలితే మళ్లీ గ్రామంలోకి వస్తుందని గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు పనికి అడ్డుచెప్పడంతో అధికారులు చిరుతను బోనులోకి ఎక్కించి తిరుపతి ఎస్వీ జూకు తరలించారు.