ఆంధ్రప్రదేశ్‌

జిఎస్‌టి వైపు వ్యాపారుల పరుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 19: రాష్ట్రంలోని టర్నోవర్ ట్యాక్స్ (టిఒటి), విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వ్యాపారులు కొత్తగా అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)లో చేరేందుకు పరుగులు తీస్తున్నారు. ఎవరికి వారు ఆన్‌లైన్‌లోకి వెళ్ళి తమ పేర్లు, ఫొటోలతో వివరాలను అప్‌లోడ్ చేసుకుంటున్నారు. మరోపక్క వాణిజ్య పన్నుల శాఖ వ్యాపారులకు ఇప్పటికే జిఎస్‌టిలోకి ఏ విధంగా చేరి ఆన్‌లైన్ సంఖ్యను పొందాలో అవగాహనా సదస్సులు నిర్వహించింది. ఇదిలా ఉండగా జూలై 1వ తేదీ నుంచి జిఎస్‌టిని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో వ్యాపారులంతా అప్రమత్తమయ్యారు. ఈ విధానంతో దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని వాణిజ్య పన్నుల శాఖ లెక్కల ప్రకారం టిఒటి పరిధిలో సుమారు 60 వేల నుంచి 70 వేల మంది వ్యాపారులు ఉన్నారు. వీరు రూ.7.50 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య వ్యాపారాలు చేసేవారు. ఇక వ్యాట్‌లో 2 లక్షల మంది వ్యాపారులున్నారు. వీరు రూ.50 లక్షలు పైబడి వ్యాపారాలు చేస్తూ వాణిజ్య పన్నుల శాఖలో రిజిస్ట్రేషన్ పొందినవారు. వీరంతా జిఎస్‌టి పరిధిలోకి రావాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రంలో టిఒటి, వ్యాట్ పరిధిలో ఉన్న వివిధ రకాల వ్యాపారాలు చేసే 70 శాతం మంది వ్యాపారులు జిఎస్‌టి పరిధిలోకి వచ్చారు. వీరంతా ఆన్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంకా 30 శాతం మంది రావాల్సి ఉంది. వీరిని కూడా జీఎస్‌టి పరిధిలోకి తీసుకువెళ్లడానికి వాణిజ్య పన్నుల శాఖ కృషిచేస్తోంది. ఇక జిఎస్‌టి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్ ఏర్పాటుచేసింది. దీని పరిధిలోకి వెళ్ళిన వారికి ప్రత్యేకమైన యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌లను కూడా కేటాయిస్తారు. వీటి ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఈ విధానం ద్వారా వ్యాపారులకు అనేక ప్రయోజనాలు కూడా కలగనున్నాయి.
ఇదిలా ఉండగా పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం పెరిగింది. నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు జరిగిన వ్యాపార లావాదేవీలను పరిశీలిస్తే ప్రతీ వాణిజ్య పన్నుల శాఖ అధికారి (సిటిఒ) కార్యాలయం పరిధిలోనూ వృద్ధి కనిపించింది.
నగదు అందుబాటులో లేక అత్యధికశాతం ప్రజలు డెబిట్, క్రెడిట్ కార్డులు తదితర నగదు రహిత లావాదేవీలు కొనసాగించారు. దీనితో అప్పటి నుంచి జరిగిన వ్యాపారమంతా అధికారికం కావడంతో దానిపై చెల్లించాల్సిన పన్ను వాణిజ్యపన్నుల శాఖకు వచ్చింది. ఈ విధంగా రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖకు 17 శాతం మేర ఆదాయం పెరిగినట్టు సమాచారం.