ఆంధ్రప్రదేశ్‌

నగదు రహిత లావాదేవీల్లో మనమే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: రేషన్ దుకాణాల్లో నగదు రహిత లాలాదేవీలు నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కృష్ణా జిల్లా కలెకర్ట్ బాబు అన్నారు. చౌక దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలను అవలంబిస్తున్న విధానాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. గురువారాం కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అధ్యక్షతన ఢిల్లీలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ వ్యవస్థలపై జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు బాబు హాజరయ్యారు. సదస్సులో చౌక ధరల దుకాణాల్లో నగదు రహిత లావాదేవీల నిర్వహణపై చర్చించినట్టు తెలిపారు. మార్చినాటికి రేషన్ దుకాణాల్లో పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలను అమలు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించినట్టు బాబు వెల్లడించారు. ఏపీలో 29వేల రేషన్ దుకాణాలలో నగదు రహిత లావాదేవీలు అమలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే అన్ని జిల్లాలో రేషన్ కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానించడం జరిగిందని, బ్యాంకు ఖాతాలను గతంలోనే అనుసంధానం చేసినట్టు ఆయన వివరించారు.