ఆంధ్రప్రదేశ్‌

లంబసింగిలో 2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, జనవరి 19: విశాఖ మన్యంలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ఒక పక్క మంచు, మరో పక్క చలితో గిరిజనులు బయటకు రాలేని పరిస్థితి. గత 10 రోజుల నుంచి చూస్తే గురువారం తెల్లవారు జామున లంబసింగిలో రెండు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, చింతపల్లిలో 5, గూడెంకొత్తవీధిలో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచు ఎక్కువ కురుస్తుండడంతో తెల్లవారు జామున వెళ్ళే వాహనాలకు కనీసం రహదారి కనిపించని పరిస్థితి నెలకొంది. లంబసింగిలో మంచును ఆస్వాదించేందుకు పర్యాటకుల తాకిడి కూడా అధికమైంది. రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరిగి మైనస్ డిగ్రీలకు చేరుకునే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు.