ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధి కావాలంటే మోదీని బలపరచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 19: దేశం అభివృద్ధి చెందాలంటే, రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే కేంద్రంలో మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గురువారం నెల్లూరు సర్వోదయ కళాశాల మైదానంలో ఖాదీ హస్తకళల ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విలేఖరులతో మాట్లాడుతూ త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం తథ్యమని ఆయన పేర్కొన్నారు. బిజెపి అభివృద్ధి, సుపరిపాలన ప్రధాన అజెండాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్, సమాజ్ పార్టీలు దేశాన్ని నాశనం చేశాయని అన్నారు. కుంభకోణాలతో దేశాన్ని అభివృద్ధిలో వెనుక్కు నెట్టాయని అన్నారు. యుపిలో సైకిల్ గుర్తు కోసం తండ్రీ కొడుకులు కొట్టుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మణిపూర్‌లో బిజెపి గెలుస్తుందని, పంజాబ్‌లో గట్టి పోటీ ఉన్నా, బిజెపి, అకాలీదళ్ కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
క్రీడలకు కేంద్రం ప్రాధాన్యత
క్రీడలకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని, భవిష్యత్తు క్రీడాకారులను తీర్చిదిద్దడంలో భాగంగానే ‘ఖేలో ఇండియా’కు శ్రీకారం చుట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నెల్లూరులో ‘ఖేలో ఇండియా’ కార్యక్రమంలో భాగమైన అండర్-14 జాతీయ క్రీడాపోటీలను గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. 22వ తేది వరకు జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలకు చెందిన బాలబాలికలు హాజరయ్యారు. కబడ్డీ, ఖోఖో, ఉషు (రణవిద్య) అంశాల్లో ఈ పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. శాప్ నిర్వహించనున్న 37వ జాతీయ క్రీడలను నెల్లూరులో నిర్వహించేందుకు మొగులపాళెం స్పోర్ట్స్ విలేజ్‌గా తీర్చిదిద్దే ఉద్దేశంతో 150 ఎకరాల్లో ఐదు కోట్ల 40 లక్షల రూపాయలు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. 37వ జాతీయ క్రీడలను కూడా నెల్లూరులో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఆధునిక వసతులు ఏర్పాటుకు రెండు కోట్ల 98 లక్షల రూపాయలు వెచ్చించామన్నారు. నెల్లూరు జిల్లాలో నాలుగు క్రీడా వికాస కేంద్రాలను, ఒక్కొక్కటి రెండు కోట్ల రూపాయల వ్యయంతో కోవూరు, వెంకటగిరి, ఉదయగిరి, కావలి డివిజన్ విడవలూరులో ఏర్పాటు చేయుటకు శంకుస్థాపన చేశామన్నారు.