ఆంధ్రప్రదేశ్‌

గంజాయ సాగుపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 19: గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఎన్ సాంబశివరావు చెప్పారు. వివిధ శాఖల సమన్వయంతో పటిష్ఠ వ్యూహంతో ఉక్కుపాదం మోపుతామన్నారు. గంజాయి నియంత్రణకు అడిషనల్ డిజిపి స్థాయి అధికారితో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. రాజమహేంద్రవరంలో గురువారం వివిధ విభాగాల ఉన్నతాధికారులు, పోలీసు కమిషనర్లు, పదమూడు జిల్లాల ఎస్పీలతో జరిగిన సమీక్షా సదస్సును నిర్వహించారు. సదస్సు అనంతరం డిజిపి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గంజాయి కేసుల్లో గతంలో కొంత మంది పోలీసు అధికారుల పాత్ర ఉండటం తదితర అంశాలను కూడా సమీక్షించామని, రవాణా, సాగు, వినియోగం, మధ్యవర్తులు తదితర అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి ఈ సదస్సులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. స్మగ్లర్ల నెట్‌వర్కుపై దృష్టి సారించామన్నారు. రాష్ట్రంలో దాదాపు 10వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోందన్నారు. విశాఖ మన్యం ప్రాంతంలోనే దాదాపు 80 శాతం గంజాయి సాగవుతోందని, 15 శాతం తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో, మిగిలిన 5 శాతం ఇతర చోట్ల సాగవుతోందని గుర్తించామన్నారు. సాగును ధ్వంసం చేసేందుకు ఎక్సైజ్ శాఖతో సమన్వయంతో పోలీసు శాఖ పటిష్ఠ వ్యూహంతో చర్యలు చేపడుతోందన్నారు. రైళ్ల ద్వారా దూర ప్రాంతాలకు రవాణా జరుగుతోందని, దీన్ని పసిగట్టడానికి జాగిలాలను వినియోగిస్తామని చెప్పారు. రైళ్ల ద్వారా జరుగుతున్న రవాణాకు తూర్పు గోదావరి జిల్లాలోని తుని, విశాఖ జిల్లాలోని అనకాపల్లి రైల్వే స్టేషన్లు కేంద్రంగా ఉన్నట్టు గుర్తించామన్నారు. గత ఏడాది రాష్ట్రంలో 70 వేల కిలోల గంజాయి సీజ్‌చేశామని, 1600కు పైగా కేసులు పెట్టామని డిజిపి చెప్పారు. 2015లో 45వేల కిలోల గంజాయిని పట్టుకుని, 900 కేసులు నమోదు చేశామన్నారు. సాగు నుంచి వినియోగం వరకు నిఘా పెంచామన్నారు. కేసులు పగడ్బందీగా లేకపోవడం వల్ల శిక్షల నుంచి స్మగ్లర్లు తప్పించుకుంటున్నారన్నారు. పదేళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం కూడా చట్టంలో ఉందన్నారు. కాలేజీలు, అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టామని, దర్యాప్తులో లోపాలు లేకుండా చూస్తే కేసులు పునరావృతం కావన్నారు. కోడి పందాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1367 కేసులు నమోదు చేశామని డిజిపి సాంబశివరావు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సిఐడి అడిషనల్ డిజిపి సిహెచ్ ద్వారకాతిరుమలరావు, రైల్వే అడిషనల్ డిజిపి కెఆర్‌ఎం కిషోర్ కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజిపి హరీష్ కుమార్ గుప్త, విశాఖ సిపి యోగానంద్, ఏలూరు రేంజి డిఐజి రామకృష్ణ, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.