ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక వ్యవస్థ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 19: పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందని, ప్రజాప్రయోజనాల కోసమే రూ.500, 1000 నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దును 90శాతం మంది ప్రజలు స్వాగతించారన్నారు. ప్రజాసంక్షేమం కోసం ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తుందని, నల్లధనం, అవినీతి, తీవ్రవాదం, నక్సలిజంపై ఉక్కుపాదం మోపినట్లేనన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తోందని చెప్పారు. గ్రామీణ వ్యవస్థలో మార్పులు, రైతుల సంక్షేమం కోసం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందన్నారు. ప్రధాన మంత్రి కృషి సంచాయక యోజన కింద రూ.160 కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.1560 కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.360 కోట్ల నిధులు అందిస్తోందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.900 కోట్లు కేటాయించిందన్నారు. అభివృద్ధి ఎంతో ప్రధానమైనదని, మోదీ పాలనలో అది వేగం పుంజుకుందన్నారు. కార్మిక శాఖ నుండి కార్మిక సంక్షేమానికి నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. కార్మికులకు అందించే రోజువారీ వేతనాన్ని రూ.216 నుండి రూ.300కు పెంచామని ఆయన చెప్పారు. బోనస్‌ను రూ.3500 నుండి 7 వేలకు పెంచామన్నారు. మహిళా కార్మికుల ప్రసూతి సెలవులను 26 వారాలు చేశామన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన సాగుతోందని మంత్రి దత్తాత్రేయ వివరించారు. విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సనె్న ఉదయ్‌ప్రతాప్ పాల్గొన్నారు.