ఆంధ్రప్రదేశ్‌

ఏడాదికి రూ.170 కోట్లు కోరతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయవరం, జనవరి 19: బ్రాహ్మణ సంక్షేమానికి వచ్చే రెండేళ్లలో ఏడాదికి రూ.170 కోట్లు వంతున నిధులు ప్రభుత్వం నుంచి కోరనున్నట్టు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం నుంచి నిధులు కోరనున్నట్టు తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమానికి విడుదలయ్యే ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా చూడటం తన బాధ్యతన్నారు. 2014-15 సంవత్సరంలో రూ.25కోట్లు, 2015-16లో రూ.35కోట్లు విడుదలయ్యాయన్నారు. 2016-17లో రూ.65 కోట్లు విడుదల కాగా, ఇప్పటివరకు రూ.40 కోట్లు ఖర్చుచేశామన్నారు. ఇప్పటివరకు విడుదలైన నిధుల ద్వారా 30వేల మందికి ప్రయోజనం చేకూరగా, ఈ ఏడాది చివరినాటికి మరో పదివేల మందికి లబ్ధిచేకూర్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అర్చక వృత్తి చేసే వారిని వివాహం చేసుకోవడానికి యువతులు ముందుకురావడంలేదన్నారు. అందుకే చంద్రశేఖర స్కీము ద్వారా అర్చకులను వివాహం చేసుకుంటే ఆ దంపతులకు రూ.లక్ష డిపాజిట్ చేస్తామని, ఆ సొమ్మును ఐదేళ్ల అనంతరం వారు ఖర్చుచేసుకునే విధంగా వీలు కల్పిస్తామని కృష్ణారావు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర బ్రాహ్మణ యువత అధ్యక్షుడు సూరంపూడి కామేష్, జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దంతుర్తి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.