ఆంధ్రప్రదేశ్‌

‘ఉక్కు’ ఉద్యమానికి ప్రజామద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 19: ఉక్కుకర్మాగారం సాధన కోసం ఉక్కు కర్మాగారం సాధన సమితి అధ్యక్షుడు జివి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రొద్దుటూరు పట్టణంలో చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు పెద్ద ఎత్తున ప్రజామద్దతు లభిస్తోంది. కుల సంఘాలు, స్వచ్చంద సేవాసంస్థలు, రాజకీయపార్టీల నేతలు, మేధావులు, ముఖ్యంగా యువకులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. గురువారం జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున యువకులు ప్రొద్దుటూరు తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. ఉక్కు పరిశ్రమల సాధన కోసం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గత రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు. విభజన అనంతరం పాలకుల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి దీక్షకు పూనుకున్నారు. అన్నిరకాలుగా అనుకూల పరిస్థితులు ఉన్న ఉక్కు పరిశ్రమకు అటు కేంద్రప్రభుత్వ రంగం సంస్థ సెయిల్, రాష్ట్రీయ ఇస్పాత్ లిమిటెడ్‌తో పాటు పలు ప్రైవేట్ కంపెనీలు ముందుకొచ్చినా కేంద్రం ఎటూ తేల్చలేదు. దీంతో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఉక్కు కర్మాగారం సాధన కోసం ఆమరణ నిరాహారదీక్షకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉక్కు పరిశ్రమ సాధించేంత వరకు ఆమరణ దీక్ష విరవించే ప్రసక్తేలేదని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్దమేనని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ ఆందోళనపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఇంటలిజెన్స్‌శాఖ సమాచారం ఇచ్చింది.