ఆంధ్రప్రదేశ్‌

ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకానికి వచ్చే బడ్జెట్‌లో వందకోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: ఎన్‌టిఆర్ విదేశీ విద్యాదరణ పథకం కింద విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయల మంజూరు చేసి వేలాది మంది విద్యార్థులకు సహాయం అందిస్తున్నామని బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పొట్టిశ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్‌టిఆర్ విదేశీ విద్యాదరణ పథకం కింద అర్హులైన విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ఎన్‌టిఆర్ విదేశీ విద్యాదరణ పథకానికి రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.65 కోట్లు నుంచి రూ.100 కోట్లు బడ్జెట్‌లో కేటాయించబోతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పథకం గురించి విద్యార్థులకు మంత్రి వివరిస్తూ ప్రతి సంవత్సరం వెయ్యి మంది అర్హులైన వెనుకబడిన తరగతుల విద్యార్థులకు విదేశీ విద్యా పథకం ద్వారా విదేశాలలో ఉన్నత విద్యను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి విద్యార్థికి సుమారు 10 లక్షల రూపాయల ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుందని మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణ సహాయం కింద అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 6,910.64 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఎన్‌టిఆర్ విదేశీ విద్యాదరణ పథకం కింద బిసి విద్యార్థులు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, రష్యా తదితర విదేశాలలో విద్యను అభ్యసించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 72 మంది విద్యార్థులు విదేశీ విద్యాదరణ పథకానికి దరఖాస్తు చేసుకోగా అర్హత కలిగిన 24 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. సమావేశంలో బిసి వెల్‌ఫేర్ డైరెక్టర్ కె.హర్షవర్ధన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ కేశవరావు, వడ్డేర ఫెడరేషన్ చైర్మన్ డి.మురళి, వాషర్‌మాన్ ఫెడరేషన్ చైర్మన్ ఆర్.నారాయణ, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ కంకాచారి, సాగర్ ఫెడరేషన్ చైర్మన్ ఇ.ఏడుకొండలు, జెఎన్‌టియు ప్రతినిధి బాలాజి, బలిజ ఫెడరేషన్ చైర్మన్ కె.సామాజ్య్రం, నారుూబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.