ఆంధ్రప్రదేశ్‌

29 నుంచి పోలవరం గేట్ల పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: పోలవరం ప్రాజెక్టు గేట్లు, డయాఫ్రం వాల్ పనులు ఈ నెల 29 నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ ఇప్పటికే ఇం దుకు సంబంధించిన డిజైన్లను కేంద్ర జల సంఘం ఖరారు చేసిందన్నారు. ఒక ఒక బ్లాక్, ఒక పిల్లర్ నిర్మాణం పూర్తి అయిన తరువాత పూర్తి స్థాయి లో డిజైన్‌పై స్పష్టత వస్తుందన్నారు. 12 బ్లాక్‌లు, 48పిల్లర్లను నిర్మి ంచాల్సి ఉందన్నారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి వర్చ్యువల్ ఇన్స్‌పెక్షన్ చేయనున్నారన్నారు. పోలవరం ప్రా జెక్టు పనులను సచివాలయంలోని ఉన్నతాధికారులు సందర్శించేందుకు ఆ సక్తి కనబరుస్తున్నారని, త్వరలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చే యనున్నట్లు వెల్లడించారు. సహకరించిన వారిపై కూడా కేసులు నమో దు చేయనున్నట్లు తెలిపారు. సుబాబుల్ రైతులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్న తమమై విమర్శలు చేయడం సరికాదని హితవుపలికా రు. జలవనరుల శాఖకు సంబంధిం చి వివిధ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లపై శుక్రవా రం ఉన్నతాధికారులతో సమీక్ష చేశామని తెలిపారు. 29 విభాగాలకు సం బంధించి 4944 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. వచ్చే సమావేశం నాటికి పెండింగ్‌లో ఉండటానికి కారణాలపై స్పష్టత వ స్తుందన్నారు. ఉద్యోగులు కొన్ని స మస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని, త్వరలో వాటిని పరిష్కరిస్తామన్నారు. నీరు- ప్రగతి, నీరు-చెట్టు కా ర్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ నిర్వహించనున్నామన్నారు.