ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమ పథకాల్లో ప్రతిభావంతులకు నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం 2016 కింద వివిధ సంక్షేమ పథకాల్లో 5 శాతం నిధులను వీరికి కేటాయించా ల్సి ఉంటుందని రాష్ట్ర మహిళా సాధికారత, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం వెలగపూడి సచివాలయంలో శుక్రవారం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మేరకు నిధులను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 15 కోట్ల రూపాయల వ్య యంతో మోటారైజ్జ్ త్రీ వీలర్స్‌ను 2500 ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎ స్స, ఎస్టీ, సబ్‌ప్లాన్‌లో కూడా విభిన్న ప్రతిభావంతులకు సబ్‌ప్లాన్ ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు. ప్రైవేట్ సంస్థల్లో కూడా 5 శా తం ఉద్యోగాలను వీరికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే బడ్జెట్‌లో వీరి కోసం 100 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి వేతనాలను ఒక వారం రోజుల్లో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 5000 అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాన్ని మార్చి నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బాలామృతం త్వరలో ప్రారంభించనున్నామని, స్థలం కోసం పరిశీలన చూస్తున్నట్లు తెలిపారు. కోడిగుడ్ల సరఫరాలో నాణ్యతా లోపం ఉంటే చర్య లు తీసుకుంటామన్నారు. వైకల్యం ధ్రువీకరణ పత్రాలను దరఖా స్తు చేసిన వారం రోజుల్లోగా కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల డైరెక్టర్ కె.శారదాదేవి, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పీతల సుజాత