ఆంధ్రప్రదేశ్‌

పశువులకు కాలం చెల్లిన మందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జనవరి 20: పనికిరాని (కాలం చెల్లిన) మందులతో పశువులకు వైద్యం చేస్తున్న పశువైద్యాధికారుల నిర్వాకమిది. రెండు, మూడు ఏళ్ల క్రితమే కాలం చెల్లిన మందులను అభం శుభం, ఎరుగుని నోరులేని మూగ జీవాలకు వాడుతూ కాలం గడుపుతున్న పశువైద్యాధికారుల చర్యలపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసి, జేడికి ఫిర్యాదు చేసి విచారణకు ఆదేశించటంతో వెటర్నరీ డెప్యూటీ డైరెక్టర్ ఈ సంఘటనపై గంటల వ్యవధిలోనే విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించడం చకచకా జరిగిపోయాయి. ఈసంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
కృష్ణాజిల్లా మైలవరంలోని ప్రభుత్వ పశువైద్యశాలలో గత కొన్ని మాసాలుగా తమ గెదెలకు చూడి(కట్టు) నిలవటం లేదని, పశువైద్యశాలలో ఇంజక్షన్లు చేయిస్తున్నా ఫలితం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. ఇదే విషయంపై కొందరు రైతులు పశువైద్యశాలలో వైద్యులు చూడి నిలవటం కోసం చేసే ఇంజక్షన్లు కాలం తీరినవని వాటి వలన ఉపయోగం లేకపోగా పశువులకు ఇతరత్రా జబ్బులు వస్తున్నాయని శుక్రవారం స్థానిక పాత్రికేయుల దృష్టికి తీసుకురాగా పాత్రికేయులంతా ఆసుపత్రికి వెళ్లి పరిశీలించారు.
ఆసుపత్రిలో ఉన్న మందుల్లో దాదాపు 70శాతం మందులు కాలం తీరినవి దర్శనమిచ్చాయి. ఈవిషయంపై ఆసుపత్రి వైద్యుడు ఎస్ ప్రసాద్ లింగంను వివరణ కోరగా కాలం తీరినప్పటికీ కొన్ని మందులు వాడినా నష్టం లేదని, మరి కొన్నింటిని తాము వాడటంలేదని, నులిపురుగుల మందును రైతులకు ఇవ్వటానికి అవసరమైన ఖాళీ సీసాలకై వీటిని వినియోగిస్తామని చెప్పారు. కాలంతీరిన మందులు ఆసుపత్రిలో ఎలా ఉంచుతారు, ఎలా ఉపయోగిస్తారని అడిగితే అది తప్పేనని చెప్పారు. ఈవిషయాన్ని పాత్రికేయులు మంత్రి ఉమ దృష్టికి ఫోన్‌లో తీసుకుపోగా ఆయన తీవ్రంగా స్పందించారు. వెంటనే వెటర్నరీ జిల్లా జాయింట్ డైరెక్టర్ దామోదర నాయుడుకు ఫోన్‌లో ఇక్కడి విషయంపై ఫిర్యాదు చేయటంతోపాటు ఈసంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జేడి ఆదేశాల మేరకు డెప్యూటీ డైరెక్టర్ బెనర్జీ ఇక్కడికి వచ్చి ఆసుపత్రిలో విచారణ జరిపారు. కాలం తీరిన మందులు ఉన్నట్లు తన విచారణలో వెల్లడైందని ఆయన పాత్రికేయులకు వెల్లడించారు. విచారణ అనంతరం నివేదికను జేడికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.