ఆంధ్రప్రదేశ్‌

తడిచెత్త నుంచి చేపల మేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 20: అందరూ చెత్త.. చెత్త అని తిట్టుకుంటారు, ఇప్పుడు అదే తడి చెత్త నుంచి చేపలకు, పశువులకు అవసరమైన పోషక విలువలు కలిగిన మేతను తయారుచేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు చెప్పారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారత దేశానికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న ఆక్వా రంగానికి ఎంతో మేలుజరుగుతుందన్నారు. త్వరలోనే ఈ పరిశోధనలు పూర్తవుతాయని, అప్పుడు దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, బివి రాజు విద్యాసంస్థల విద్యార్థులతో శుక్రవారం జరిగిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ్భారత్ లక్ష్యాన్ని ఏడాది ముందే పూర్తిచేస్తారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 46 లక్షల మందికి మరుగుదొడ్లు నిర్మించారని, ఇంకా 53 లక్షల మందిని గుర్తించారన్నారు.రాష్ట్రంలోని 11 వేల గ్రామాల్లో బహిరంగ మలమూత్ర విసర్జనపై నిషేధం ప్రకటించారని వెంకట్రావు తెలిపారు. అదేవిధంగా ‘చెంబుకు చెక్ పెడదాం’ అనే నినాదంతో గ్రామాల్లోకి స్వచ్ఛ సైనికులు వెళ్లాలని పిలుపునిచ్చారు. గుజరాత్ విధానాన్ని రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలుచేసి విజయాన్ని సాధిస్తామని వివరించారు. ప్రస్తుత తరుణంలో ఆసుపత్రుల్లో ఒకే బెడ్‌పైన ఇద్దరు పడుకుంటున్నారని, దీనికి కారణం వ్యాధులేనని తేల్చి చెప్పారు. స్వచ్ఛ ఆంధ్రతో ఆసుపత్రుల్లో బెడ్‌లన్నీ ఖాళీగా ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన ఆరోగ్యరక్ష పథకం ద్వారా రాష్ట్రంలోని 35 లక్షల మంది మధ్యతరగతి కుటుంబాలకు మంచి కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. 2022 నాటికి రోగాలులేని ఆంధ్రప్రదేశ్ స్థాపనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. 1986లో ప్రారంభించిన టోటల్ శానిటేషన్, నిర్మల్ గ్రామ పురస్కార్ వంటి వాటికన్నా స్వచ్ఛ్భారత్ గొప్పదన్నారు.