ఆంధ్రప్రదేశ్‌

ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు/కందుకూరు,జనవరి 20: ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పిసిపల్లిలో శుక్రవారం ఫ్లోరోసిస్, కిడ్నీ బాధితులతో జగన్ ముఖాముఖి మాట్లాడారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినందువలనే కిడ్నీ బాధితులు మృతి చెందుతున్నారని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీకోసం 910కోట్ల రూపాయలు కావాలని సంబంధిత శాఖ కోరితే 568 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేశారన్నారు. అందులో 368 కోట్ల రూపాయలు బకాయిలకే సరిపోయిందని మిగిలిన నిధులు ఏమూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో కుంటికాలుతో నడుస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఆ విధంగా నడిచేందుకు కూడా నాలుగువందల కోట్లరూపాయలు కావాలని ఆయన కోరారు. తాను అధికారంలోకి రాగానే వైద్యంకోసం ఏ పేదవాడు అప్పులుపాలుకాకుండా చూసుకుంటానని ఆయన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు భరోసా ఇచ్చారు. ఒకవేళ వైద్యంలో భాగంగా ఇంటివద్దే ఆ వ్యక్తి విశ్రాంతి తీసుకుంటుంటే అతని కుటుంబం నడిచేందుకు కావాల్సిన సహాయం కూడా చేస్తానని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు. దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో ప్రతిఒక్కరికి కార్పొరేట్ వైద్యాన్ని అందించారని గుర్తుచేశారు. ఏ రోగికైనా కాన్సర్ వస్తే 8లక్షల రూపాయలు అవసరం, ఆనిధులను ప్రభుత్వం ఖర్చుపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాని రాష్ట్రప్రభుత్వం ఈవిషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. 108 అంబులెన్స్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. గత వైఎస్ జమానాలో ఫోన్‌చేసిన వెంటనే 108 ఇంటిముందు ఉండేదని ఆయన గుర్తుచేశారు. గత ఐదునెలలనుండి ఆశావర్కర్లకు జీతాలు రావటం లేదన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి 1460కోట్లరూపాయలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాకు తలమానికంగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిఅయితేనే ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరకుతుందన్నారు. తన తండ్రి హయాంలో వెలుగొండ ప్రాజెక్టుకు 4700కోట్లరూపాయలను కేటాయించారని, ఈప్రభుత్వం మాత్రం ఆ ప్రాజెక్టును గాలికి వదిలేసిందని దుమ్మెత్తిపోశారు. దీనివలన ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్ధితి ఉందని ఆయన ధ్వజమెత్తారు. జిల్లాలో 56మండలాల్లో 48 మండలాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉందని ఆయన గుర్తుచేశారు. ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి కనిగిరి నియోజకవర్గం కోసం గత సంవత్సరం ఎంపి గ్రాంటు నుండి 12లక్షల రూపాయలు ఇచ్చారని కాని పనులు ప్రారంభించలేదని ఆయన ధ్వజమెత్తారు. కిడ్నీ సమస్యలతో మృతిచెందిన వారికి పదిలక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిడ్నీ బాధితులకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని, గత రెండు సంవత్సరాలుగా ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రికి పది లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదని వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పిసిపల్లిలో జరిగిన బహిరంగ సభకు జిల్లాలోని నలుమూలలనుండి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

చిత్రం..కనిగిరిలో కిడ్నీ బాధితులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్