ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక సంస్కరణల రూపకర్త పివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 21: ప్రస్తుతం భారతదేశం అనుసరిస్తున్న ఆర్థిక సంస్కరణల రూపకర్త దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు అని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం ఏర్పాటు కార్యక్రమంలో ‘నాగరికత - సంస్కృతి - సమాజం’ అంశాలపై పివి స్మారకోపన్యాసం చేశారు. దేశ ఆర్థిక రంగాన్ని ప్రగతిబాటకెక్కించిన ఘనత పివికే దక్కుతుందన్నారు. పివి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి అచేతనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు తీసుకువచ్చి క్రియాశీలకంగా, ప్రగతిశీలకంగా మార్చిన సంస్కరణల ఆద్యునిగా పేర్కొన్నారు. సంపదను వృద్ధి చేసుకుంటూ ఆర్థిక ప్రగతిని సాధించే క్రమంలో సంపదను సమానంగా పంపిణీ చేసి అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వం జోక్యం అవసరమన్నారు. దేశానికి పరిణితి చెందిన ఆర్థిక వాది పివి చేసిన సేవలను మనం గుర్తించడలేకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం మనం అనుసరణీయమనుకుంటున్న సాంకేతికత భవిష్యత్‌లో ఉద్యోగావకాశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నూతన సాంకేతికత ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పెను మార్పులకు ఆజ్యం పోస్తోందని, ఈ కారణంగా 65 శాతం మంది ఉద్యోగాలు కల్పోయే ప్రమాదం ఉందని, నైపుణ్యత, సాంకేతికత ఆధారిత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె చలమేశ్వర్ మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, బహుభాషా కోవిదుడు పివి ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో, ఒక జాతికో పరిమితం చేయడం సరికాదన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సారధ్యంలో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, లా అకాడెమీ డైరెక్టర్ గోడ రఘురాం, ఎమెస్కో ప్రచురణల అధినేత దూపాటి విజయకుమార్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.

పివి స్మారకోపన్యాసం చేస్తున్న జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య