ఆంధ్రప్రదేశ్‌

పంచాంగకర్తలు ఏకతాటిపైకి రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 22: హిందూ పండుగల విషయంలో ప్రజల్లో తలెత్తుతున్న గందరగోళాన్ని నివారించడానికి పంచాంగకర్తలంతా ఏకతాటిపైకి రావాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన పంచాంగకర్తల సమన్వయ సదస్సు పిలుపునిచ్చింది. పంచాంగ రచనలో ఏకాభిప్రాయానికి వచ్చి హిందుమతాన్ని కాపాడుకోవాలని కోరింది. భిన్న పంచాంగ గణిత-్ధర్మశాస్త్ర విధానాలపై ఈ సదస్సు జరిగింది. వరాహమిహిరుని కాలం నుంచి పంచాంగముల చరిత్రపై పాల్వంచకు చెందిన పంచాంగకర్త గొడవర్తి సంపత్‌కుమార్ ఆచార్య మాట్లాడుతూ పంచాంగ రచనలో వరాహమిహిరుడు, సూర్యసిద్ధాంతం ప్రామాణికమన్నారు. మారుతున్న సూర్యగతి ప్రకారం పంచాంగ రచనను మార్చుకోవాలన్నారు. ప్రభుత్వం, కొంతమంది పంచాంగకర్తల సిద్ధాంతం ప్రకారం క్రీస్తుపూర్వం 499 నుంచి 2017 సంవత్సరం వరకు ప్రతీ ఏటా 3.24 నిమిషాల చొప్పున సూర్యగతిలో తేడా ఉందన్నారు. దీంతో 3రోజులు వెనుక ఉన్నామన్నారు. పంచాంగకర్తల మధ్య విభేదాలను నివారించడానికి ముందే పంచాంగకర్తల ఏకీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పంచాంగకర్త తంగిరాల వేంకట కృష్ణపూర్ణప్రసాద్ పూర్వపద్ధతితో కూడిన దృక్ సిద్ధాంతంపై మాట్లాడుతూ సూర్యచంద్రుల గమనం ప్రకారం పంచాంగ రచన జరుగుతుందన్నారు. శ్రీశైలం ఆస్థాన పంచాంగకర్త బుట్టే వీరభద్రదైవజ్ఞ మాట్లాడుతూ పంచాంగకర్తలంతా ఏకాభిప్రాయానికి వచ్చేందుకు కృషిచేస్తామన్నారు. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం రిటైర్డ్ వైస్‌చాన్సలర్ బ్రహ్మశ్రీ శ్రీపాద సత్యనారాయణమూర్తి, ఎవైఎస్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీమాన్ ఎస్‌టికె శ్రీరంగాచార్యులు, కంచిపీఠం పంచాంగకర్త లక్కావఝ్జుల సుబ్రహ్మణ్య సిద్ధాంతి, అప్పల శ్రీనివాసశర్మ, తంగిరాల వేంకట సుబ్రహ్మణ్య పాలభాస్కరశర్మ, గుదిమళ్ల యతీంద్రశర్మ, ఎంవిఆర్ శర్మ, మధుర పాలశంకరమూర్తిశర్మ తదితరులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ పలు సందేహాలను లేవనెత్తారు. వాస్తవ ప్రమాణాలకు అనుగుణంగా పంచాంగ రచన జరగాలన్నారు. విశ్వవిజ్ఞాన ప్రతిష్టానం, జ్యోతిష విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈసదస్సులో పంచాంగకర్తలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.