ఆంధ్రప్రదేశ్‌

కిందినుంచి పైదాకా ముడుపులు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జనవరి 22: ఆబ్కారీ శాఖ లో కానిస్టేబుల్ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు ముడుపులు చెల్లించనిదే పనులు జరగవు, నెలసరి వేతనాలు ఇవ్వాలంటే కార్యాలయ అధికారులకు లంచాలివ్వాల్సిందే, సిఐగా పదోన్నతి పొంది ఆర్నెళ్లు అవుతున్నా ఇంతవరకు ఎస్‌ఐ వేతనమే చెల్లిస్తున్నారు, ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అడిగినా, లంచం ఇస్తేనే.. అని ఖరాకండిగా చెబుతున్నారని చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కర్నాటక సరిహద్దు చీకలబైలు ఆబ్కారీ చెక్‌పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న సిఐ ప్రసాద్‌రెడ్డి ఉన్నతాధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ప్రసాద్‌రెడ్డి యూనిఫారం ధరించి ఉన్నతాధికారులపై సంచలన ఆరోపణలు, వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాకు చెందిన తాను 1981లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా విధులలో చేరి 1994లో హెడ్‌కానిస్టేబుల్‌గా, 2004లో ఎక్సైజ్ ఎస్‌ఐగా, 2016లో ఆగస్టులో ఎక్సైజ్ సిఐగా పదోన్నతి వచ్చిందన్నారు. కర్నూలు జిల్లాలోనే ఎక్సైజ్ సిఐగా బదిలీ చేయడం, ఉన్నతాధికారులకు విన్నవించుకుని డిప్యుటేషన్‌పై చిత్తూరుజిల్లా మదనపల్లె మండలం చీకలబైలు ఆబ్కారీ చెక్‌పోస్టు ఎక్సైజ్ సిఐగా గత ఆర్నెళ్లుగా విధులు నిర్వర్విస్తున్నట్లు తెలిపారు. అయితే 1994లో ఆబ్కారీశాఖ పరిపాలన విభాగంలో తనకు అదనంగా ఇంక్రిమెంట్ పడిందని, అదనంగా పడిన ఇంక్రిమెంట్ అదనంగా రూ.1.50 లక్షలు వరకు తీసుకున్నట్లు రికార్డులు ఉన్నాయని, ఆ మొత్తం తిరిగి ప్రభుత్వానికి చెల్లించి సిఐ వేతనం తీసుకోవాలని పరిపాలన అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. సిఐ వేతనం కాకుండా కేవలం ఎస్‌ఐ వేతనం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.