ఆంధ్రప్రదేశ్‌

మరో రికార్డు వేటలో మరలిరాని తీరాలకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పాతబస్తీ), జనవరి 22: కాళ్లు, చేతులు కట్టుకుని కృష్ణానదిలో మూడు కిలోమీటర్లు ఈది గతంలో రికార్డు నెలకొల్పిన హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు ఆదివారం ఆకస్మికంగా మృతి చెందాడు. విజయవాడ ఎపి ఎన్‌పిఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు(45)కు ఆదివారం ఉదయం గుండెపోటు రావటంతో బందరు రోడ్డులోని రమేష్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. కృష్ణవేణి స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యుడైన ఉమామహేశ్వరరావు 1994లో పోలీసు కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. గజ ఈతగాడైన ఆయన నీటిలో అద్భుత విన్యాసాలతో అనేక రికార్డులు నెలకొల్పాడు. ముఖ్యంగా కాళ్లు, చేతులు తాళ్లతో కట్టుకుని కృష్ణానది ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు ఈదటం, నదిలో మూడు కిలోమీటర్ల దూరం ఈదటం గతంలో ఈ రికార్డులు. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం వస్తోందంటే చాలు రాష్ట్ర, నగర వ్యాప్తంగా ప్రజలు ఆయన ఈత విన్యాసాల కోసం ఎదురు చూస్తుంటారు. అంతటి ఘటికుడైన ఆయన గుంటూరు జిల్లా వైపు ఆదివారం నదిలో ఈదుతుండగా ఛాతి నొప్పిగా అనిపంచటంతో కొంతదూరం ఈది వెనుకకు తిరిగి ఒడ్డుకు చేరి, స్పృహలేని స్థితిలో పడిపోయాడు. అసోసియేషన్ సభ్యులు ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గంట వ్యవధిలో ఆయన మృతి చెందాడు. ఉమామహేశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం బందరు వద్ద సముద్రంలో ఈదాలని కూడా ట్రయల్ వేశాడు. కాళ్లు, చేతులు కట్టుకొని సముద్రంలో మూడు కిలోమీటర్లు ఈది ప్రపంచ రికార్డు సాధించాలనేది ఆయన కల. ఈతలో అద్భుత విన్యాసాలతో పాటు విధుల నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఉమామహేశ్వరరావు సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాన్ని అందించి గౌరవించింది. చిన్న వయస్సులోనే ఈత రికార్డు నెలకొల్పిన ఉమామహేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు.

కాళ్లు, చేతులు కట్టుకుని కృష్ణానదిలో ఈతకు సిద్ధమైన ఉమామహేశ్వరరావు (ఫైల్ ఫొటో)

చిత్రం..భౌతికకాయం వద్ద అధికారికంగా నివాళులర్పిస్తున్న జవాన్లు