రాష్ట్రీయం

మృతుల గుర్తింపులో అయోమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 22: హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతులను గుర్తించడంలో సిబ్బంది అయోమయానికి గురయ్యారు. ఈ రైలులో ఇంజిన్ తరువాత జనరల్ బోగీ, స్లీపర్ కోచ్‌లు 2, ఎసి బోగీ, ఎస్ 7, ఎస్ 8 బోగీలు నుజ్జునుజ్జు కావడంతో మృతులను గుర్తించడంలో జాప్యం జరిగింది. మరోపక్క ఈ రైలులో స్లీపర్ కోచ్‌లో కూడా సాధారణ ప్రయాణికులు ఉండటం గమనార్హం. మృతుడి వద్ద పిఎన్‌ఆర్ ఆధారంగా మృతులను కొంతమందిని గుర్తించారు. ఈ సంఘటనలో మొత్తం 41 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నప్పటికీ వీరి సంఖ్య పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. మృతుల్లో విజయనగరం జిల్లాకు చెందిన వారు ఆరుగురు ఉన్నట్టు సమాచారం. వీరిలో జియ్యమ్మవలస మండలంలోని చిన కొదమకు చెందిన మిరియాల కృష్ణ (32), పాత్రపిల్లి పోలిశెట్టి (26), పాత్రపిల్లి శ్రీనుశెట్టి (29), సాలూరుకు చెందిన సోమ అమ్మన్న (50), పార్వతీపురంనకు చెందిన మండల బలరాం (45), విజయనగరంలోని రంగుల వీధికి చెందిన కె.రేవతి (16) మృతి చెందినట్టు గుర్తించారు. మిగిలిన వారంతా ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బీహార్‌కు చెందిన ఒకే కుటుంబంలోని 8 మంది బంధువులు ఈ సంఘటనలో దుర్మరణం పాలయ్యారు. దీంతో బాధితులు సంఘటన స్థలం వద్ద బోరున విలపించారు. రైలు దుర్ఘటనలో 41 మంది మృతి చెందినప్పటికీ రైల్వే సిబ్బంది 21 మృతదేహాలను గుర్తించినట్టు పేర్కొన్నారు. వారిలో రాయగడకు చెందిన రంజన్ నాయక్ (18), జియ్యమ్మవలసకు చెందిన మిరియాల కృష్ణ (34), కార్తీక్ సాహు (21), బి.శ్రీను (21), దిలీప్‌కుమార్ రౌత్, సుభాష్ చంద్రసాహు, సుబాబతి సాహు, బి.కమల, ఎస్.రేణుక, సిఆర్‌పిఎఫ్ హెచ్‌సి పికె మింజ్, గాయత్రి సాహు, సోము అన్నమ్మ, విష్ణుప్రసాద్ సాహు, పి.పోలి, జషోద పండిట్, రాం ప్రసాద్ పండిట్, కె.రేవతి, ఎం.బలరాం, టికె ప్రదాన్, రాధ, పూలన్‌దేవి, కె.రవికుమార్, బెడుదర్ బోయిల మృతదేహాలను గుర్తించారు. క్షతగాత్రులను ఒడిశాలోని రాయగడ, ఆంధ్రలోని పార్వతీపురం ఏరియా ఆసుపత్రి, విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. శనివారం అర్ధరాత్రి జరిగిన రైలు ప్రమాదంలో 41 మంది మృత్యువాత పడ్డారు. రైల్వే అధికారుల లెక్కల ప్రకారం 55 మందికి చికిత్స అందించినట్టు పేర్కొన్నారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న తొమ్మిది మంది ప్రయాణికులను విశాఖపట్నంలోని కెజిహెచ్‌కు తరలించారు. రాయగడ ప్రభుత్వ ఆసుపత్రికి 19 మంది, పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి 12 మందిని తరలించారు. రాయగఢ ఆసుపత్రికి తరలించిన వారిలో పబాన్ ప్రసాద్ శంకర్, సుకంటి నంద, బింబదేవ్ జెనా, విజయ్‌కుమార్ భయాన్, టంకదర్ బాగ్, చోలుకాలు, కాలి ప్రసాద్ సాహు, దుల జమీర్ బంజ, గౌరమ్మ, లింగరాజు పాడి, దీన బందు అధికారి, త్రిలోకేశ్వర్ మిశ్ర, సుమిత్ మరి పండా, భాస్కర్ పండా, ప్రకాష్ సాహు, సునితి సాహు, నిహిర్ మెకెల్, శోభా గిరిడిజ, ఉమాకాంత్ గురుబిషిలు ఉన్నారు. పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించిన వారిలో నిరుపమా మిశ్ర, జోత్స్నరాణి పండా, లిసా సాహు, తేజేశ్వరి పండిట్, కుమార్ పుల్లి, డోలి నల్లి, సంతోష్‌కుమార్ మహాపాత్రో, నాగుల భగవాన్, సిద్దాంతం ఈశ్వర్‌రావు, బైల శంకరరావు, ప్రదీప్ పండా ఉన్నారు. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు.