ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 22: కూనేరు రైల్వేస్టేషన్ సమీపాన జరిగిన రైలు దుర్ఘటన కారణంగా సంఘటనా సంఘటనా స్థలం నుంచి ప్రయాణికులు బయలుదేరి వెళ్ళేందుకు వీలుగా ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరు డివిజన్ అధికారులు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశారు. ఇందులోభాగంగా జగదల్‌పూర్-జునాగఢ్ రోడ్డు-్భవనేశ్వర్ (18448) హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌ను 13 కోచ్‌లతో నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక రైలు కూనేరు నుంచి బయలుదేరి భువనేశ్వర్‌కు వెళ్తుంది. రాయగడ, టిట్లాఘర్, సంబల్‌పూర్, అంగూల్ రైల్వేస్టేషన్ల మీదుగా ఆదివారం దీనిని నడిపారు. అలాగే సమీప ప్రాంతాలకు తరలివెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం 13 ప్రత్యేక బస్సుల సదుపాయాన్ని వాల్తేరు డివిజన్ అధికారులు కల్పించారు. వీరంతా బ్రహ్మపూర్, భవానీపట్న తదితర సమీప ప్రాంతాలకు వెళ్ళేందుకు వీలుగా వీటిని అందుబాటులోకి ఉంచారు.
పవన్ కల్యాణ్ సంతాపం
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నా ఇటువంటి ప్రమాదాలు జరగడం శోచనీయమన్నారు. క్షతగాత్రులకు మేలైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు ఆమోదయోగ్యమైన నష్టపరిహారాన్ని అందించాలని కోరారు.