ఆంధ్రప్రదేశ్‌

జలాల విడుదలలో నేతల పోటాపోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 22: కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌కు చేరిన కృష్ణా జలాలను వామికొండ రిజర్వాయర్‌కు విడుదల చేసేందుకు అధికార టిడిపి, ప్రతిపక్ష వైకాపా నేతలు పోటీపడ్డారు. అందులో భాగంగా ఆదివారం వైకాపా ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాధరెడ్డి, నాయకులు డాక్టర్ సుధీర్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి తదితరులు గేట్లు ఎత్తారు. ఆ సమయంలో వైకాపా నేతలు, కార్యకర్తలు వైఎస్‌ఆర్ అమర్ హై, వైఎస్సార్‌కే అంకితం అని నినాదాలు చేయగా, అందుకు ప్రతిగా అధికార పార్టీ నేతలు సిఎం చంద్రబాబునాయుడు జిందాబాద్, కృష్ణా జలాలలు ప్రజలకు అంకితం అని నినదించారు. ఇక భారీ పోలీసు బలగాలు మోహరించడంతో వైకాపా, టిడిపి నేతలు గేట్లు ఎత్తే కార్యక్రమం ముగించుకుని ఎవరికి వారు తిరుగుముఖం పట్టారు. గాలేరు-నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన ఎద్దుల ఈశ్వరరెడ్డి గండికోట జలాశయం నుంచి వామికొండకు ఆదివారం కృష్ణాజలాలు విడుదల చేశారు. తొలుత వైకాపా నాయకులు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి మోటారును ఆన్ మొదటి గేట్‌ను ఎత్తారు. ఆ తర్వాత సతీష్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పూజ చేసి రెండవ గేట్‌ను ఎత్తారు. ఈ సందర్భంగా ఎంపి అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ గండికోట నుంచి వామికొండకు కానీ సర్వారాయసాగర్‌కు కానీ, పైడిపాలెంకు కానీ కృష్ణాజలాలు వస్తున్నాయంటే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే అన్నారు. రాయలసీమ నుంచి కరవు కాటకాలను పారదోలేందుకు వైఎస్ ప్రాజెక్టులు నిర్మించారని వాటి ఫలితంగానే నేడు కృష్ణా జలాలు రాయలసీమకు వస్తున్నాయని గుర్తుచేశారు. మరో 15 రోజుల్లో సర్వారాయ సాగర్‌కు కూడా కృష్ణా జలాలు ఇస్తామని తెలిపారని, అలా ఇవ్వని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. అనంతరం టిడిపి నాయకులు సతీష్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ గాలేరు-నగరికి రూపకల్పన చేసింది ఎన్‌టి రామారావు అని, ఈ ప్రాజెక్టులను మొదలుపెట్టింది టిడిపి ప్రభుత్వమే అన్నారు. చంద్రబాబు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించి ప్రాజెక్టుల వద్దే నిద్ర చేసి పూర్తి చేయించి నీరందించారని కొనియాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రమణారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి బిటెక్ రవి తదితరులు పాల్గొన్నారు.