ఆంధ్రప్రదేశ్‌

పివి, టంగుటూరిలకు ‘్భరతరత్న’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: ఎల్లవేళలా సమాజ హితం కోరుకునే బ్రాహ్మణులు నేడు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి వున్న తరుణంలో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఎపి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌కు ఏటా కనీసం రూ.500 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం నాడిక్కడ జరిగిన కృష్ణా, గుంటూరు జిల్లాల బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో సంఘం నేతలు డిమాండ్ చేశారు. దేశంలోనే పేరొందిన మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి దివంగత టంగుటూరి ప్రకాశం పంతులుకు భారతరత్న పురస్కారంతో గౌరవించాలని కేంద్రాన్ని కోరారు. గన్నవరం విమానాశ్రయానికి ప్రకాశం పంతులు పేరు పెట్టాలని కోరారు. శాసనమండలికి బ్రాహ్మణ వర్గం నుంచి ఒకరిని నామినేట్ చేయాలని, దుర్గగుడితో పాటు అన్ని దేవాలయాల కమిటీల్లో బ్రాహ్మణులకు స్థానం కల్పించాలని, చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాలను కొనసాగించాలని కోరారు.
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి రంగరాజు మాట్లాడుతూ ప్రతి బ్రాహ్మణుడు తమ పిల్లలకు పాపభీతితో పాటు అవసరమైతే కత్తి చేతపట్టుకునేలా ధైర్యాన్ని కూడా నూ రిపోయాలన్నారు. రాజకీయాల్లోకి తీ సుకురావాలన్నారు. తోటి సమాజం ఎ టుపోతే నాకేమి, నా పిల్లలు విదేశాల్లో కోట్లు సంపాదిస్తున్నారనే తృప్తితోపా టు తోటి పేద బ్రాహ్మణులను ఎంతోకొంత ఆర్థికంగా ఆదుకోవాలన్నారు.
మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఏటా రూ.500 కోట్లు కేటాయిస్తానని చెప్పి ప్రస్తుతం రూ.50 నుంచి 70 కోట్లు మించి కేటాయించడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తరహాలో బ్రాహ్మణుల జనాభా నిష్పత్తి ఆధారంగా బడ్జెట్ కేటాయించినప్పుడు బ్రాహ్మణులు అన్ని రంగాల్లో ఇతరులకు దీటుగా నిలవగలరని ఆయనన్నారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కొప్పరపు బలరామకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం శివరామకృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎన్ వెంకట రామరాజు, కార్యదర్శి సిరిపురపు శ్రీ్ధర్, రాష్ట్ర నాయకులు దమ్మాలపాటి చంద్రశేఖర్, పారిశ్రామికవేత్త మాగంటి సుబ్రహ్మణ్యం, చెట్లపల్లి మారుతీప్రసన్న, జింకా చక్రధర్, కార్పొరేటర్ గండూరి మోహన్, కోనూరు సతీష్‌శర్మ, తదితరులు ప్రసంగించారు.

చిత్రం..సమావేశంలో ప్రసంగిస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు