ఆంధ్రప్రదేశ్‌

చిత్రావతిలో కుంగిపోయిన భూమి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, జనవరి 22: అనంతపురం జిల్లా యల్లనూరు మండలం గొడ్డుమర్రి గ్రామం సమీపంలో ఆదివారం చిత్రావతినదిలో భూమి కుంగిపోయింది. సంవత్సర కాలంలోనే చిత్రావతి నదిలో ఇలా రెండుసార్లు భూమి కుంగిపోవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. చిత్రావతి నదిలో దాదాపు 50 న 20 అడుగుల వెడల్పుతో గుండ్రని గొయ్యి ఏర్పడిందన్నారు. చిత్రావతి నదికి దాదాపు 15 సంవత్సరాల నుంచి నీరు రాకపోవడంతో ఏరుమొత్తం వట్టిపోయిందన్నారు. గత ఏడాది జనవరి 29వ తేదీ ఇదే రీతిలో చిత్రావతి నదిలో భూమి కుంగిపోయింది. దాంతో అప్పట్లో భూగర్భ శాస్తవ్రేత్తలు భూమి కుంగిపోయిన ప్రాంతంలో పర్యటించి పరిశీలించారు. చిత్రావది నదిలోని ఇసుకలో తేమ శాతం లేకపోవడంతో ఇసుక వదులుకావడంతో భూమి కుంగిపోయిందని, భయపడాల్సిన అవసరం లేదని శాస్తవ్రేత్తలు తెలిపారు. అయితే మరోమారు చిత్రావతినదిలో భూమి కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు