ఆంధ్రప్రదేశ్‌

‘ఉద్దానం’ సమస్యకు ఎయిమ్స్ సూచనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పర్యటించిన ఎయిమ్స్ (్ఢల్లీ)కి చెందిన నలుగురు సభ్యుల కేంద్ర బృందం ఐదు తాత్కాలిక పరిష్కారాలను సూచించింది. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ఈ బృందం సభ్యులు ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. త్వరలో ఈ అంశంపై నివేదిక ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. తాత్కాలిక పరిష్కార చర్యల్లో భాగంగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, మందులు ఉచితంగా అందించాలని, పరిశుభ్రమైన మంచినీరు అందించాలని ఆ బృందం సూచించింది. రోగులకు కౌనె్సలింగ్‌కు ఏర్పాట్లు, ఆహారంపై అవగాహన కల్పించాలని, స్థానిక వైద్యాధికారులకు శిక్షణ సహా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఫిబ్రవరి 6న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి బృందం సమస్యకు అసలు కారణంపై అధ్యయనం చేస్తుందని మంత్రి తెలిపారు.