ఆంధ్రప్రదేశ్‌

రెచ్చిపోయన వంశధార నిర్వాసితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం/ ఎల్.ఎన్‌పేట, జనవరి 22: సమస్యలు పరిష్కరించకుండా వంశధార రిజర్వాయర్ నిర్మాణ పనులు పోలీసుల పహరాతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో సహనం కోల్పోయిన నిర్వాసితులు ఆగ్రహం ఉగ్రరూపం దాల్చింది. రిజర్వాయర్ నిర్మాణ చరిత్రలో లేని విధంగా వంశధార నిర్వాసితులు కట్టలు తెంచుకోవడంతో ఆందోళనలు పెల్లుబికాయి. సోమా గుత్తేదారుల ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి. నిర్వాసితుల ప్రతిఘటనతో హిరమండలం, ఎల్.ఎన్‌పేట మండలాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఉద్యమాన్ని అదుపుచేయాల్సిన పోలీసులు చేతులెత్తేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం హిరమండలం మండలంలోని బర్రిపేట, పెద్దసంకిలి, చిన్నసంకిలి, గదబపేట, దుగ్గుపురం, పాడలి, తులగాం, గార్లపాడు, చిన్నకొల్లివలస, గొట్టాబ్యారేజ్ జంక్షన్, కొత్తూరు మండలం కృష్ణాపురం, హిరమండలం నిర్వాసితుల గ్రామాల నుంచి వేలాది మంది నిర్వాసితులు గొట్టాబ్యారేజ్ జంక్షన్‌కు చేరుకొని ఆందోళన చేపట్టారు. కార్మికమంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కలమట వెంకటరమణ దిష్టిబొమ్మలను ఊరేగింపు చేపట్టి దగ్దం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిడిపి బ్యానర్లు, ఫ్లెక్సీలను కాల్చివేశారు. ఆందోళనకారులు గొట్టాబ్యారేజ్ జంక్షన్ వెనుక భాగంలో స్పిల్‌వే పనుల వద్ద పొక్లయినర్ వాహనాల అద్దాలను పగులకొట్టడంతో పాటు పలు పరికరాలకు నిప్పు అంటించారు. అక్కడ నుంచి ఊరేగింపుగా కర్రలతో తరలివచ్చిన మహిళలు, పెద్దలు, చిన్నారులతో హిరమండలం ప్రధాన రహదారి మీదుగా ర్యాలీగా వస్తూ స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. అలాగే తహశీల్దార్ కార్యాలయ సముదాయంలోని ఎంపిడి ఒ, విద్యాశాఖ, తహశీల్దార్ కార్యాలయాల తలుపులు, కుర్చీలు, అద్దాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. సోమా కంపెనీకి సంబంధించిన వాహనాలకు నిప్పంటించారు.

చిత్రం..ఆదివారంనాడు గొట్టాబ్యారేజ్ జంక్షన్‌వద్ద ఆందోళన చేస్తున్న వంశధార నిర్వాసితులు