ఆంధ్రప్రదేశ్‌

అర్చకులను వంచిస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూదేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులను వంచిస్తోందని, రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఎపి అర్చక సమాఖ్య ఆరోపించింది. అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎ. ఆత్రేయబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పెద్దింటి రాంబాబు ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్చకుల సర్వీసు రూల్స్‌కు సంబంధించిన ఫైలును గత రెండేళ్ల నుండి ప్రభుత్వం తొక్కి పెడుతోందన్నారు. చట్టంపై అవగాహన లేని అధికారులు వక్రభాష్యం చెబుతూ, ఈ ఫైలుకు ఆమోదం రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఎపిలోని మూడు ప్రాంతాల్లో గత డిసెంబర్‌లో గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించి, అర్చకుల సమస్యలను వింటామని ప్రకటించారని వారు గుర్తు చేశారు. డిసెంబర్ 15 న విజయవాడలో, డిసెంబర్ 20 న విశాఖలో, 27 న కర్నూలులో ఈ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించి వాటిని రద్దు చేశారన్నారు. 2017 జనవరి 24 న తిరుపతిలో మరో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించి, సంబంధిత కమిషనర్ హాజరుకాలేదన్నారు. అర్చకుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదని స్పష్టమవుతోందని, అర్చక కుటుంబాల జీవితాలతో ఆటలాడుకోవడం అధర్మమన్నారు. ఇప్పటికైనా బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ చైర్మన్, అర్చక సంక్షేమ నిధి ట్రస్ట్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు జోక్యం చేసుకుని అర్చకులకు న్యాయం చేయాలని ఆత్రేయబాబు, రాంబాబు కోరారు.