ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా ఉద్యమానికి చిన్నరాజప్ప మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, జనవరి 24: ప్రత్యేక హోదా కోసం జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ చేస్తున్న పోరాటాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం చిత్తూరుజిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ తమిళనాడులో జల్లికట్టుకు మద్దతుగా కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చిందని, దానిని స్ఫూర్తిగా తీసుకొని పవన్‌కల్యాణ్ మరికొందరు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించడంపై మంత్రి స్పందించారు. ఈ ఉద్యమం మంచిదేనని, తాముకూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు.