ఆంధ్రప్రదేశ్‌

ఫ్యాప్టో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో మూడు దశల ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది.
జనవరి 30, 31 తేదీల్లో అన్ని పాత తాలూకా కేంద్రాల్లో ధర్నాలు, ఫిబ్రవరి 13న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఫిబ్రవరి 27న రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు నేతలు తెలిపారు. 30 డిమాండ్ల చార్టర్‌ను ఫెడరేషన్ తరఫున నేతలు పి బాబురెడ్డి, జి హృదయరాజ్, సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు, పి పాండురంగ వరప్రసాద్, పి కృష్ణయ్య, జి వి నారాయణ రెడ్డి, ఎం రవిచంద్ర కుమార్ తదితరులు విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. డిటెన్షన్ విధానం తిరిగి చర్చకు వస్తోందని, పబ్లిక్, ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్ కింద పాఠశాలలు అప్పజెప్పేందుకు పథకాలు సిద్ధం అవుతున్నాయని, గత ఏడాది వచ్చిన క్లస్టర్ పాఠశాలల ప్రతిపాదనలు, యుపి స్కూళ్ల మూత, రేషనలైజేషన్, టిఎస్‌ఐటి పరీక్ష, సమ్మెటివ్ పరీక్షలకు మూల్యాంకనంలో జంబ్లింగ్ విధానం వంటివి నిలుపుదలకు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఎంతో కృషి జరిగిందని అన్నారు. పండిట్, పిఇటిల అప్‌గ్రేడేషన్ ఉత్తర్వులు వచ్చినా అమలుకాలేదని వారు చెప్పారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులు పెన్షన్ భద్రత కోల్పోయారని, సిపిఎస్ విధానం రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానం సాధించాల్సి ఉందని, సుప్రీంకోర్టులో పరిష్కారం లభించినా, ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పదోన్నతులు కల్పిస్తామని చెప్పడమే తప్ప అమలులో జరగడం లేదని పేర్కొన్నారు. విద్యారంగంలోని గురుకులాలు, మోడల్ స్కూల్స్, కెజిబివిల్లో ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ద్వారా నియమితులైన వారు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని నియామకాలన్నీ రెగ్యులర్ ప్రాతిపదికపై జరగాల్సి ఉందని అన్నారు.