ఆంధ్రప్రదేశ్‌

దాచుకున్నది పంచిపెట్టటమే సుపరిపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 24: ప్రజలను దోచుకోవటం ప్రజాపాలన కాదని, దాచుకున్నది ప్రజలకు పంచి పెట్టటమే ప్రజాపాలన అని, రామరాజ్యంలో ఇదే అమలయ్యేదని మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న అష్టలక్ష్మీ సమేత స్వర్ణ మహాలక్ష్మీ ఆలయంలో మంగళవారం నిర్వహించిన బ్రహ్మ కలశాభిషేక మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు అనుగ్రహభాషణ చేశారు. నేటి పాలనలో దోచుకోవటమే పరమావధిగా ఉందని, అది సుపరిపాలన అనిపించుకోదన్నారు. పూర్వీకులు, రాజరికంలో సమస్తం త్యాగం చేసి ప్రజల సుఖదుఃఖాలను పాలకులు చూసేవారన్నారు. అలాగే కామధేనువులను వధిస్తే అన్ని అరిష్టాలే సంప్రాప్తిస్తాయన్నారు. గోవులను రక్షించేందుకు అందరూ కంకణబద్ధులు కావాలన్నారు. యాగాలు, యజ్ఞాల ఉద్దేశాలు ప్రజలను కష్టాలనుండి, నష్టాలనుండి రక్షించటమేనన్నారు. రఘువంశ పాలనలో ప్రజలను ఇలాగే పాలించేవారని ఆయన చెప్పుకొచ్చారు. హైందవాన్ని కాపాడటమంటే సంస్కృతి సంప్రదాయాలను గౌరవించటమేనన్నారు. నేటి యువత పాశ్చాత్య పోకడలకు అలవాటు పడి సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోయే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల్లో నిత్యపూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించటం ద్వారా ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. అనంతరం అశ్వమేధ యాగం నిర్వహణ తీరుతెన్నులు, కామధేనువు(గోసంరక్షణ)లపై ప్రవచించారు. అనంతరం స్వస్తి పుణ్యవాచనము, యజ్ఞ,యాగాదాలు నిర్వహణ, వాటి ఫలితాలు వివరించారు.

చిత్రం..అష్టలక్ష్మీ దేవాలయంలో మంగళవారం భక్తులకు అనుగ్రహభాషణం చేస్తున్న మైసురు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామిజీ