ఆంధ్రప్రదేశ్‌

సంప్రదాయేత సాంకేతికతో పేదలకు ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 24: ఢిల్లీలోని గుర్గావ్‌లో పేదల కోసం నిర్మిస్తున్న గృహాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ మంగళవారం సందర్శించారు. అక్కడ టెనె్నల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మిస్తున్న ఇళ్లలో నాణ్యతా ప్రమాణాలు, వాటికయ్యే ఖర్చు, నిర్మాణానికి పట్టే సమయం తదితర వివరాలను అక్కడి అదికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో పేదల కోసం 1,20,000 ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుంది. దీని కోసం మంత్రి ఇప్పటికే ముంబాయి, అహ్మదాబాద్ వంటి వివిధ నగరాల్లో పర్యటించి విభిన్న టెక్నాలజీలను, అనుసరించే పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఏపిలో నిర్మించే ఇళ్లు దేశంలోనే ద బెస్ట్‌గా ఉండాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ కూడా ఢిల్లీలో పేదల గృహాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ వాడుతున్న టెనె్నల్ టెక్నాలజీ ద్వారా కేవలం 4 రోజుల్లో ఒక ఫ్లోర్ నాణ్యంగా నిర్మించగలిగే అవకాశం ఉంది. ఇదే టెక్నాలజీని రాష్ట్రంలోని గృహాల్లో అనుసరించి, కేవలం 18 నెలల్లో 1,20,000 ఇళ్లను నిర్మించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఈ ఇళ్లను అన్ని రకాల సౌకర్యాలతో, అత్యంత నాణ్యంగా నిర్మించాలన్న ముఖ్యమంత్రి సూచన మేరకు దేశ వ్యాప్త అధ్యయనం చేస్తున్నామని పురపాలక మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. గతంలోని ప్రభుత్వాలు నివాసయోగ్యంగా లేని ఇళ్లను నిర్మించి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టాయని, ఆ పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించే ఇళ్లు దేశంలో ఒక బెస్ట్ మోడల్‌గా ఉండబోతున్నాయని మంత్రి నారాయణ వివరించారు.