ఆంధ్రప్రదేశ్‌

‘సోషల్ మీడియా’ ప్రచార సభలకు నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 24: రాష్ట్రంలో సోషల్ మీడియా ప్రచారం ఆధారంగా చేపట్టే సమావేశాలు, సభలను అనుమతించబోమని డిజిపి నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో విజయవాడ, విశాఖ, తిరుపతి పట్టణాల్లో ఈ నెల 26న సమావేశమయ్యేందుకు తరలిరావాలంటూ సోష ల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆగంతకుల పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తే అడ్డుకుంటామని చెప్పారు. నిర్వాహకులెవరో తెలీకుండా చేపట్టే ఈ తరహా కార్యక్రమాల్లో అసాంఘిక శక్తులు చొరబడి హింసను ప్రేరేపించే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ భావస్వేచ్ఛను వ్యక్తం చేసేందుకు పోలీసులు అడ్డుతగలరని, అయితే అడ్రసు లేని వ్యక్తుల ప్రేరేపిత ప్రచారం వల్ల సమావేశాలు నిర్వహిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేపట్టాలంటూ రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, తిరుపతి, తదితరచోట్ల నుంచి ప్రజలు, యువత పెద్దఎత్తున తరలిరావాలని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ప్రచారంపై రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది. దీంతో స్పందించిన డిజిపి నండూరి మంగళవారం సాయంత్రం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు. సోషల్ మీడియాకు నియంత్రణ లేనందున క్షణాల్లో సమాచారం ప్రజలకు చేరుతుందని, అయి తే వీటిలో మంచితో పాటు సమాజంపై చెడుప్రభావం చూపే విషయాలను కూడా ప్రజలను తెలుసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ కార్యక్రమాన్నైనా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నియంత్రిస్తారన్నారు. ఒకవేళ సమావేశాలు జరుపుకోవాలనుకుంటే నిర్వాహకులు ముందుకొచ్చి పోలీసులను సంప్రదించాలని, పరిశీలించిన మీదట అనుమతి ఇస్తామన్నారు. అనుమతి తీసుకున్న కార్యక్రమాలకు పోలీసులు భద్రత కల్పిస్తారని, అంతేగాని నిర్వాహకులు ఎవరో తెలీకుండా ఆగంతకుల పిలుపు మేరకు సమావేశమయ్యేందుకు జనం, యువత, విద్యార్థులు తరలివస్తే పోలీసులు చట్టపరంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే పరిస్థితి ఉందని ప్రస్తావించగా.. ఎవరైనా సరే అనుమతి లేకుండా సమావేశాలు అనధికారికంగా నిర్వహించకూడదని చెప్పారు. నిర్వాహకులు లేకుండా కార్యక్రమం చేపడితే ఊరుకునేది లేదని, హింస జరిగితే పోలీసులపైనే నెపం వేస్తారని అన్నారు. గతంలో కూడా ముద్రగడ పద్మనాభం ఆందోళనకు నాలుగుసార్లు అడిగితే మూడుసార్లు అనుమతి ఇచ్చామని, తుని ఘటన దృష్ట్యా అనుమతి తీసుకోకుండా ఆయన నిర్వహించే ఆందోళన దృష్ట్యా అరెస్టు చేస్తామని నండూరి ప్రకటించారు.
కుట్రకోణం లేదు
ఇటీవల జరిగిన హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన దర్యాప్తులో కుట్రకోణంపై ఆధారాలు లేవని డిజిపి చెప్పారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఘోర ప్రమాదానికి గురై సుమారు 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఘటనపై ఎన్‌ఐఏ, సిఐడి బృందాలు దర్యాప్తు చేపట్టాయి. కాగా సిఐడి దర్యాప్తులో విద్రోహ చర్యలకు సంబంధించిన క్లూస్ ఏమీ లభించలేదని, దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు.
ఐజిని వివరణ కోరతాం
ఎర్రచందనం కేసులో స్మగ్లర్ల కన్నా పోలీసుల ప్రమేయమే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఐజి కాంతారావుపై డిజిపి నండూరి సీరియస్‌గా స్పందించారు. ఎర్రచందనం కేసుల దర్యాప్తునకు ప్రభుత్వం కాంతారావును ప్రత్యేకాధికారిగా నియమించిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల పైనే ఆయన వ్యాఖ్యలు చేయడాన్ని పరిగణనలోకి తీసుకున్న డిజిపి ఏవైనా ఫిర్యాదులుంటే తమ దృష్టికి తీసుకురావాలిగాని, అలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. పోలీసుల పాత్రపై విచారణ జరుగుతోందని, ఐజి కాంతారావును వివరణ కోరతామని నండూరి వివరించారు.