రాష్ట్రీయం

మణుగూరు ఓసీలో భారీగా బొగ్గు నిక్షేపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణుగూరు, జనవరి 24: ఎట్టకేలకు గత నెలలో నిర్వాసితుల నోళ్లలో మట్టికొట్టి సింగరేణి సంస్థ ప్రారంభించిన మణుగూరు ఓసీ అమల్లో విజయం సాధించింది. తాజాగా రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓసీలో రెండు భారీ బొగ్గు నిల్వలు ఉన్న కోల్ బెంచ్‌లకు ఓబీ పనులు నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ సింగరేణికి అప్పగించినట్లు సమాచారం. మణుగూరు ఓసీలో బొగ్గు నిల్వలు బయటపడటంపై సింగరేణి సంస్థలో కొత్త మోదం నెలకొంది. నిర్వాసిత బతుకులు ఒకపక్క బుగ్గిపాలవుతున్నా పట్టించుకునే నాథుడే లేక నిర్వాసితులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంత నిర్వేదానికి మణుగూరు తాహశీల్దార్ నిర్లక్ష్యపు ధోరణే ప్రధాన కారణమని వారు నిప్పులు చెరుగుతున్నారు. నిర్వాసితుల జాబితా ఎప్పుడో ఖరారైనప్పటికీ వారికి పరిహారం చెల్లింపులో జాప్యానికి తాము కారణం కాదని, సింగరేణి సంస్థ ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తమ ఓసీ పనులు అడ్డగించేందుకు ప్రయత్నించిన నిర్వాసితులపై సంస్థ పోలీసులను ప్రయోగించింది. రెవెన్యూ అధికారుల నివేదిక ఆధారంగా తాము పరిహారాన్ని ఆ శాఖకు ఎప్పుడో జమ చేశామని, తమపై నింద మోపడం సరికాదన్నది సింగరేణి సంస్థ వాదన. ఇదిలా ఉంటే తమకు పరిహారం పూర్తిగా ఇవ్వకుండానే సింగరేణి సంస్థకు రెవెన్యూ శాఖ నో ఆబ్జక్షన్ ఎలా ఇచ్చి ఉంటుందన్నది నిర్వాసితుల వాదన. ఈ విషయం ఇప్పటికే వందలసార్లు స్థానిక తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి వేసారిపోయిన నిర్వాసితులు ఆర్డీవో, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసి వారి కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితం కానరావడం లేదని ఆవేదన చెందుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు కూడా మణుగూరు తాహశీల్దార్‌దే ఆలస్యం అంటూ చెప్పడం వింతగా ఉందని ఓసీ భూ నిర్వాసితులు వాపోతున్నారు.