ఆంధ్రప్రదేశ్‌

రెచ్చగొడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 25: ‘మీ కోసం నేను నిరంతరం ప్రయత్తిస్తున్నాను. యువత భవిష్యత్తు కోసం తాపత్రయ పడుతున్నా.. కానీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం యువతను, విద్యార్థులను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం? అదీ భారత గణతంత్ర వేడుకల రోజున నిరసనలు తెలియజేయటం సబబేనా?’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం రాత్రి ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్‌ఐపిబి, భాగస్వామ్య సదస్సు, తదితర అంశాలపై ఆయన మాట్లాడుతూ భాగస్వామ్య సదస్సు ముందు గొడవలు చేయాలను కోవడం సమంజసమా? అని ప్రశ్నించారు. యువతను, విద్యార్థులను రెచ్చగొట్టే, చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్న వారి మాయలో పడవద్దని హితవుపలికారు. రిపబ్లిక్ డే రోజున బ్లాక్ బ్యాడ్జీలు దుర్మార్గులు పెట్టుకుంటారని విమర్శించారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నిర్వహించామని, అగ్రదేశాలు ప్రధానికి వందనం చేశాయని గుర్తు చేశారు. విశాఖ ప్రజలు వీరికి భయపడి బిజెపిని గెలిపించారన్నారు. సోనియా పుట్టిన రోజు రాష్ట్ర విభజన చేశారన్నారు. ప్రతి విద్యార్థికి, తల్లిదండ్రులకు, రాష్ట్రంలో ప్రతిపౌరుడికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం అంటే జాతి గర్వపడే రోజని, ఈ రోజు తలెత్తుకు తిరుగుతున్నామంటే ఎందరో స్వాతంత్య్ర వీరులత్యాగఫలమన్నారు. పిల్లల్లో జాతీయ భావం పెంపొందించాల్సి ఉందన్నారు.
విశాఖలో రెండు రోజుల పాటు భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. దీనిని ఈ నెల 27న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభిస్తారన్నారు. గత ఏడాది నిర్వహించిన భాగస్వామ సదస్సుకు 927 ఒప్పందాలు జరిగాయన్నారు. 5.03,975 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. ఇందులో 659 ఒప్పందాలు అమలు జరుగుతున్నాయని, 2.60,876 కోట్ల రూపాయల పెట్టుబడి, 3,61,917 మందికి ఉపాధి లభించనుందన్నారు.